MI vs KKR Playing 11: ముంబైలోకి అర్జున్ టెండూల్కర్.. కేకేఆర్ నుంచి ఉమేశ్ యాదవ్ ఔట్! తుది జట్ల అంచనాలు ఇవే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా 8 పరాజయాల అనంతరం రెండు విజయాలతో గెలుపు బాట పట్టిన మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆస్వాదించాలనుకుంటుంది.
ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధించి గౌరవప్రదంగా టోర్నీని ముంగించాలనే లక్ష్యంతో ఉంది. గత రెండు విజయాలు రోహిత్ శిభిరంలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు టోర్నీని ఘనంగా ఆరంభించిన కేకేఆర్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో తేలిపోయింది. గత ఏడు మ్యాచ్‌ల్లో 6 ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. కనీసం ముంబైతో జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి మెరుగైన స్థానంలో నిలవాలని ఆ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నేటి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.

అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం..
టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన రోహిత్ సేన తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను ఆడించవచ్చు. అయితే పిచ్ కండిషన్స్ బట్టి స్పిన్నర్లు మురుగన్ అశ్విన్ లేదా హృతిక్ షోకిన్‌లో ఒకరు జట్టులోకి రానున్నారు. పిచ్‌లు నెమ్మదించిన నేపథ్యంలో స్పిన్నర్లకు ప్రాధాన్యత లభించనుంది. ఇక సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం రిలే మెరిడిత్‌ను పక్కనపెట్టవచ్చు. అయితే సెట్ అయిన కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేసేందుకు రోహిత్ ఇష్టపడకపోవచ్చు.

ఉమేశ్ యాదవ్ ఔట్...
కాలి పిక్క కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే ఉమేశ్ యాదవ్ మైదానం వీడిన విషయం తెలిసిందే. అయితే అతని గాయంపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ఉమేశ్ యాదవ్ నేటి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అతను దూరమైతే మాత్ర కేకేఆర్‌కు కష్టాలు తప్పవు. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో ఇప్పటి వరకు ఉమేశ్ 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కేకేఆర్ ఓపెనింగ్ కాంబినేషన్ బాబా ఇంద్రజీత్, ఆరోన్ ఫించ్‌లు దారుణంగా విఫలమవుతున్నారు. దాంతో వారిపై వేటు వేసే అవకాశం ఉంది. అదే జరిగితే రహానే, సామ్ బిల్లింగ్స్ బరిలోకి దిగనున్నారు.

పిచ్ రిపోర్ట్:
డీవై పాటిల్ మైదానం బౌలర్లకు కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీజులో ఓపికగా నిలిచిన బ్యాటర్లకు సహకరిస్తోంది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇరు జట్ల రికార్డులు పరిశీలిస్తే కేకేఆర్‌పై ముంబైదే పై చేయి. 30 మ్యాచ్‌ల్లో 22 సార్లు ముంబైనే గెలిచింది. అయితే సునీల్ నరైన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 23 సార్లు ఔటయ్యాడు.

తుది జట్లు(అంచనా)
కేకేఆర్: ఇంద్రజిత్/రహానే, ఆరోన్ ఫించ్/సామ్ బిల్లింగ్స్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, శివమ్ మావి/ వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, హర్షిత్ రాణా/ఉమేశ్ యాదవ్
ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్/హృతిక్ షోకీన్, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, రిలే మెరిడిత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications