Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: బయటపడ్డ పాత గొడవలు.. మైదానంలోనే తిట్టుకున్న నితీష్ రాణా, హృతిక్ షోకీన్(వీడియో)

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆటగాళ్ల పాత గొడవలు బయటపడ్డాయి. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హృతిక్ షోకీన్ మైదానంలోనే తిట్టుకున్నారు. పాత గొడవలను మనసులో పెట్టుకొని ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు.

ముంబై ఇండియన్స్ తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్, పియూష్ చావ్లా, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నితీశ్ రాణా, హృతిక్ షోకీన్.. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకే ఆడుతారు. నితీశ్ రాణా ఢిల్లీ కెప్టెన్‌ కాగా.. హృతిక్ షోకీన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు.

 Nitish Rana, Hrithik Shokeens On-Field

వీరిమధ్య గతంలో నుంచే విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఘటనతో ఢిల్లీ టీమ్ అంతర్గత విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. హృతిక్ షోకీన్ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని నితీశ్ రాణా భారీ షాట్ ఆడగా.. డీప్‌లో రమణ్‌దీప్ సింగ్ అద్భుతంగా అందుకున్నాడు.

వికెట్ సాధించిన ఆనందంలో హృతిక్ షోకీన్.. తనదైన రీతిలో సంబరాలు చేసుకోగా.. నితీశ్ రాణా ఆగ్రహానికి గురయ్యాడు. దానికి హృతిక్ కూడా ధీటుగా బదులివ్వడంతో గొడవ పెద్దదయ్యింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగాడు. కేకేఆర్ తరఫున సెంచరీ అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో కేకేఆర్ తరఫున బ్రెండన్ మెక్‌కల్లమ్ సెంచరీ చేయగా.. 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్ అయ్యర్ ఈ ఫీట్ సాధించాడు.

దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్‌కు తోడుగా ఆండ్రీ రస్సెల్ (11 బంతుల్లో 3 ఫోర్లు వికెట్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, డాన్ జాన్సెన్, పియూష్ చావ్లా, రీలే మెరిడిత్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 16, 2023, 17:23 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+