ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. వాంఖడే మైదానంలో తేమ వచ్చినా.. రాకున్నా.. ఆరంభంలో కాస్త స్వింగ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఛేజింగ్ మంచి ఆప్షన్ అని మేం భావిస్తున్నాం. మంచి ఆరంభంతో రిథమ్ అందుకోవాలనుకుంటున్నాం.
ఓవరాల్‌గా మేం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. మేం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. విల్ జాక్స్ తుది జట్టులోకి తిరిగి వచ్చాడు. అశ్వని కుమార్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ముంబై ఇండియన్స్ తుది జట్టులో రోహిత్ శర్మ పేరు లేదు. అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. విజ్ఞేష్ పుతుర్ తిరిగి రాగా.. తెలుగు తేజం సత్యనారయణ రాజుపై వేటు పడింది.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఈ వికెట్‌ను చూసి నేను కాస్త అయోమయానికి గురయ్యాను. సాధారణంగా వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దాంతోనే టాస్ ఓడిపోవడం ఉత్తమమని భావించాను. గాలులు వీస్తున్నాయి కాబట్టి డ్యూ వచ్చే అవకాశం లేదు. మేం భారీ స్కోర్ నమోదు చేస్తే.. మా బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడుతారు. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. ప్రతీ మ్యాచ్ బాగా ఆడేందుకు అవకాశం ఇస్తోంది. ఇది అద్భుతమైన మైదానం. మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. మోయిన్ అలీ స్థానంలో సునీల్ నరైన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: క్వింటన్ డి కాక్ (కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విజ్ఞేష్ పుతుర్.