Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: అందుకే మహ్మద్ నబీని పక్కనపెట్టాం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇక మేం మా జట్టు పరువు గురించే ఆడుతున్నాం. ఇది చాలా కష్టంగా ఉన్నా.. మేం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. సొంతమైదానంలో మ్యాచ్ ఆడుతుండటం సంతోషంగా ఉంది. పిచ్ చూడటానికి బాగుంది. పైగా ఇది ఫ్రెష్ వికెట్. ముందుగా బౌలింగ్ చేసేవారికి అడ్వాంటేజ్ ఉంటుంది. తుది జట్టు ఒకే ఒక్క మార్పు చేశాం. మహమ్మద్ నబీ స్థానంలో నమన్ ధీర్‌ను తీసుకున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

MI vs KKR Hardik Pandya says Naman Dhir comes in place of Mohammed Nabi in 51 IPL 2024 Match

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. డ్యూ కీలక పాత్ర పోషించనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేయాల్సి ఉంది. జట్టులో అందరికి తమ పాత్రలపై స్పష్టత ఉంది. కెప్టెన్‌గా అందరీకి నేను చెప్పింది కూడా అదే. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించా. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్‌క్రిష్ రఘు వంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ.

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

Story first published: Friday, May 3, 2024, 19:20 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+