Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs GT: శతక్కొట్టిన సూరీడు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం!

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సూర్యతో పాటు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

Surya Kumar Yadav Century

అదిరిపోయే ఆరంభం: ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా తన ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్‌ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.

రషీద్ దెబ్బతీసినా: క్రీజులో ప్రమాదకరంగా మారిన రోహిత్-ఇషాన్‌లను రషీద్ ఖాన్.. తన తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చాడు. తొలి బంతికి రోహిత్ శర్మను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన రషీద్.. చివరి బంతికి ఇషాన్ కిషన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 61 పరగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరా(15)ను రషీద్ తన మరుసటి ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు.

సూర్య విధ్వంసం: ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విష్ణు వినోద్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30)‌తో సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. తనకే సాధ్యమైన షాట్లతో సూర్య విరుచుకుపడగా.. విష్ణు వినోద్ చూడచక్కని షాట్లు ఆడాడు. నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం విష్ణు వినోద్‌ను మోహిత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి టీమ్ డేవిడ్ రాగా.. సూర్య బౌండరీతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Surya Kumar Yadav Century

బౌలర్లకు చుక్కలే: అదే ఓవర్‌లో టీమ్ డేవిడ్(5)ను రషీద్ ఖాన్ రిటర్న్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. కామెరూన్ గ్రీన్‌ సాయంతో చెలరేగిన సూర్య.. మోహిత్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో మూడు బౌండరీలు, సిక్స్‌తో 20 పరుగులు పిండుకున్నాడు. షమీ వేసిన 19వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఆఖరి ఓవర్‌లో సూర్య.. రెండు సిక్స్‌లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో సూర్యకు ఇదే తొలి సెంచరీ.

Story first published: Friday, May 12, 2023, 21:31 [IST]
Other articles published on May 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+