For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs GT: ఇదెక్కడి షాట్‌రా సూరీడు.. ఆ క్రికెట్ దేవుడే షాకయ్యాడు! (వీడియో)

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. తనకే సాధ్యమైన షాట్లతో బౌలర్లపైకి విరుచుకుపడిన సూర్య.. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్న సూర్య.. చివరి 17 బంతుల్లో 53 పరుగులు బాదాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. మోహిత్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో మూడు బౌండరీలు, సిక్స్‌తో 20 పరుగులు, షమీ వేసిన 19వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు, అల్జారీ జోసెఫ్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది 17 పరుగులు పిండుకున్నాడు.

Suryakumars Mad Shot

చివరి మూడు ఓవర్లలో సూర్య బ్యాటింగ్ చేస్తుంటే గుజరాత్ బౌలర్లు ప్రేక్షకుల్లా నిలబడిపోయారు. అయితే మహమ్మద్ షమీ వేసిన 19వ ఓవర్‌‌లో సూర్య కొట్టిన సిక్స్.. ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. గతంలో ఏ బ్యాటర్ కూడా ఆడని రీతిలో సూర్య ఈ షాట్ ఆడాడు. షమీ వేసిన రెండో బంతిని సూర్య.. తన రిస్ట్‌ను చక్కగా ఉపయోగించి షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా సిక్సర్ రాబట్టాడు.

సూర్య ఆడినఈ ఫ్లిక్ షాట్‌కు మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఫిదా అయ్యారు. ముంబై ఇండియన్స్ మెంటార్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలా ఎలా రిస్ట్‌ను తిప్పి సిక్స్ కొట్టాడని తన చేతులను తిప్పుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఈ సూపర్ ఇన్నింగ్స్‌కు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సూరీడుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీతో పాటు సెహ్వాగ్, లక్ష్మణ్, కైఫ్ వంటి ఆటగాళ్లు సూర్యను కొనియాడుతూ ట్వీట్ చేశారు. డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ అయితే సూర్య బ్యాటింగ్‌కు రెండు చేతులు పైకెత్తి దండం పెట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యతో పాటు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్.. 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా కొనసాగుతోంది.

Story first published: Friday, May 12, 2023, 22:48 [IST]
Other articles published on May 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+