Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. వరుసగా 13 మ్యాచ్‌ల్లో 25 ప్లస్ రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

ఈ క్రమంలో అతను టెంబా బవుమా రికార్డ్‌ను సమం చేశాడు. టీ20 క్రికెట్‌లో టెంబా బవుమా కూడా వరుసగా 13 మ్యాచ్‌ల్లో 25 ప్లస్ రన్స్ చేశాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో వరుసగా అత్యధికసార్లు 25 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. రాబిన్ ఊతప్ప పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. రాబిన్ ఊతప్ప వరుసగా 10 మ్యాచ్‌ల్లో 25 ప్లస్ రన్స్ చేశాడు.

MI vs DC Suryakumar Yadav Creates History Equals Stunning World Record

ఈ ఫీట్ సాధించిన తొలి ఆసియా ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ క్రమంలో అతను కుమార సంగక్కర రికార్డ్‌ను అధిగమించాడు. ఈ శ్రీలంక ఆటగాడు వరుసగా 11 మ్యాచ్‌ల్లో 25+ రన్స్ చేశాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్, టెంబా బవుమా 13 సార్లు వరుసగా 25+ రన్స్ చేసి టాప్‌లో కొనసాగుతుండగా.. బ్రాడ్ హోడ్జ్, జాక్వెస్ రుడోల్ఫ్, కుమార సంగక్కర(11), క్రిస్ లిన్, కుమార సంగక్కర(2024) 11 సార్లు ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.

Story first published: Wednesday, May 21, 2025, 22:18 [IST]
Other articles published on May 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+