Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..!

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు 3 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం ముంబై వేదికగా జరిగిన నాకౌట్ తరహా మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడు వికెట్లతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో బుమ్రాకు ఇది 25వ మూడు వికెట్ల ఘనత. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బుమ్రా, చాహల్ మాత్రమే 20 సార్లకు పైగా మూడు వికెట్లు పడగొట్టారు. చాహల్ 22 సార్లు మూడు వికెట్లు తీసాడు.

ఈ జాబితాలో బుమ్రా(25), చాహల్(22), తర్వాత లసిత్ మలింగా(19), రవీంద్ర జడేజా(17), అమిత్ మిశ్రా(17), సునీల్ నరైన్(17), హర్షల్ పటేల్(17) ఉన్నారు. ఈ సీజన్ ఆరంభంలోనే బుమ్రా.. ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను లసిత్ మలింగా రికార్డ్‌ను అధిగమించాడు. బుమ్రా ఇప్పటి వరకు 181 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో పేసర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో బుమ్రా 9 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.

MI vs DC Jasprit Bumrah Makes History with Most Three-Wicket Hauls in IPL

ఈ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, May 22, 2025, 11:38 [IST]
Other articles published on May 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+