అయ్యర్, అశ్విన్ క్లాస్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 33 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(21 బంతుల్లో సిక్స్‌తో 20 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్ తలో వికెట్ తీసారు.

టాప్-3 విఫలం..
130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కీరన్ పొలార్డ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఓపెనర్ శిఖర్ ధావన్(8) రనౌటయ్యాడు. ఆ కొద్దిసేపటికే
మరో ఓపెనర్ పృథ్వీ షా(6).. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔటివ్వకపోగా.. ముంబై రివ్యూకెళ్లి ఫలితం రాబట్టింది. దాంతో ఢిల్లీ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాల్‌కే సిక్స్ బాది పంత్ జోరు కనబర్చాడు. బ్యాటింగ్‌కు వికెట్ ప్రతికూలంగా ఉన్నా.. స్వేచ్చగా బౌండరీలు బాదాడు. అయితే క్రీజులో కుదరుకున్న పంత్‌కు జయంత్ యాదవ్ కళ్లెం వేసాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్.. లాంగాన్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

అయ్యర్ క్లాస్..
అనంతరం అక్షర్ పటేల్ క్రీజులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడాడు. ఓ బౌండరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అక్షర్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ ధాటిగా ఆడాడు. జయంత్ యాదవ్ వేసిన 13వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాది జోరు కనబర్చాడు. అయితే బుమ్రా వేసిన ఆ మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్‌కే హెట్‌మైర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ విజయానికి 42 బంతుల్లో 37 పరుగులు అవసరమయ్యాయి.
అశ్విన్ విన్నింగ్ షాట్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ స్మార్ట్‌గా బ్యాటింగ్ చేశాడు. అనవసర షాట్లు ఆడుకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసాడు. ఈ మధ్యలో వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. దాంతో ఢిల్లీ విజాయనికి 12 బంతుల్లో 11 రన్స్ అవసరమయ్యాయి. ట్రెంట్ బౌల్ట్ వేసిన 19వ ఓవర్‌లో 7 పరుగులు రావడంతో.. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. అయితే కృనాల్ వేసిన ఆఖరి ఓవర్ ఫస్ట్ బాల్‌కే అశ్విన్ భారీ సిక్సర్ బాది ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications
