MI vs DC: దంచికొట్టిన ఇషాన్ కిషన్.. దద్దరిల్లిన ముంబై! ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!


ముంబై: ఇషాన్ కిషన్(48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 నాటౌట్) షాన్‌దార్ ఇన్నింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్‌కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), తిలక్ వర్మ(15 బంతుల్లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఓపెనర్ల శుభారంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఫోర్, సిక్సర్‌తో జోరు కనబర్చగా.. ఖలీల్ అహ్మద్ మరుసటి ఓవర్‌లో ఇషాన్ కిషన్ బౌండరీల ఖాతా తెరిచాడు. నాగర్ కోటి వేసిన 5వ ఓవర్‌లో రోహిత్ ఓ ఫోర్, సిక్స్ బాదగా.. ఇషాన్ మరో బౌండరీ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. ఖలీల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో రోహిత్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్‌లో శార్దూల్ నేలపాలు చేశాడు. దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.
కుల్దీప్ చెలరేగినా..
పవర్ ప్లే అనంతరం స్పిన్నర్లను బరిలోకి దించిన పంత్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ అవ్వగా.. క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(8) అతని మరుసటి ఓవర్‌లో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ.. ఆరంభంలో కొంత తడబడినా.. నాగర్ కోటీ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లోను మరో బౌండరీ బాదిన తిలక్.. అదే జోరులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఉన్నది కొద్దిసేపే అయినా తిలక్ ఓ చిన్న తుఫానులా విరుచుకుపడ్డాడు.
ఇషాన్ విధ్వంసం..
ఆ తర్వాత క్రీజులో వచ్చిన కీరన్ పొలార్డ్(3) తీవ్రంగా నిరాశపరిచాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. టీమ్ డేవిడ్ బ్యాటింగ్‌కు రాగా.. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఓవర్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఇషాన్.. శార్దూల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టాడు. ఇక ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఇషాన్ రెండు బౌండరీలు బాదగా.. టీమ్ డేవిడ్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో డానియల్ సామ్స్ ఓ భారీ సిక్సర్ బాదగా.. ఇషాన్ కిషన్ రెండు బౌండరీలతో ముంబై భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications