
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరఫున తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మెగా వేలంలో రూ.1.70 కోట్ల భారీ ధరకు ఈ హైదరాబాద్ కుర్రాడిని కొనుగోలు చేసిన ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే అవకాశం కల్పించింది. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా తిలక్ వర్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో తిలక్ వర్మకు ఈ అవకాశం దక్కింది.
ఇక టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషభ్ పంత్.. బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. ఐపీఎల్ ఆడుతుండటం చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. టాస్ గెలవాలని ముందే అనుకున్నామని, అది సాధించామని చెప్పాడు. పిచ్ చాలా బాగుందని అందుకే బౌలింగ్ తీసుకుంటున్నానని చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కూడా తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాడినని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ముంబైలో ఆడటం, ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందన్నాడు.
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ముంబై కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. మరీ ఈ జట్టుతో రోహిత్ ఏం చేస్తాడో చూడాలి. మరోవైపు విజయంతోనే ఈ సీజన్‌ను ప్రారంభించాలని పంత్ సేన భావిస్తోంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, టీమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషభ్ పంత్(కెప్టెన్, కీపర్), రోవ్‌మన్ పోవెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, కమలేశ్ నాగర్‌కోటీ
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, అన్‌మోల్ ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, మిల్స్, జస్‌ప్రీత్ బుమ్రా, బసిల్ థంపీ