Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK: పాపం రోహిత్ శర్మ.. క్యాచ్‌తో పాటు ప్యాంట్ జారిందిగా..!(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వాంఖడే మైదానం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విచిత్రకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ అందుకోలేకపోయాడు. క్యాచ్‌ కోసం రోహిత్ శర్మ డైవ్ చేయగా.. అతని ప్యాంట్ కూడా ఊడిపోయింది. మోకాళ్ల వరకు అతని ట్రూజర్ జారింది. ప్యాంట్ జారినా ఓ చేత్తో దాన్ని సరిచేసుకుంటూ మరో చేత్తో హిట్ మ్యాన్ వేగంగా బంతిని అందించాడు.

MI vs CSK Rohit Sharma loses his trousers as he drops a catch in IPL 2024 Match against Chennai

ఈ ఘటనతో స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు కామెంటేటర్లు నవ్వుకున్నారు. రోహిత్ శర్మ సైతం నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆకాశ్ మధ్వాల్ వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని ఆకాశ్ మధ్వాల్.. షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. గైక్వాడ్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఆ దిశలోనే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కుడి వైపు వేగంగా పరుగెత్తి క్యాచ్ కోసం డైవ్ చేశాడు. క్యాచ్‌తో పాటు అతని ట్రూజర్ కూడా జారింది. అప్పటికి గైక్వాడ్ చేసింది 39 పరుగులు మాత్రమే.

ఈ అవకాశంతో చెలరేగిన అతను 69 పరుగులు చేసి తమ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది.

రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. రచిన్ రవీంద్రతో కలిసి 52 పరుగులు జోడించిన రుతురాజ్ గైక్వాడ్.. శివమ్ దూబేతో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

Story first published: Sunday, April 14, 2024, 22:22 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+