Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK: రఫ్ఫాడించిన రహానే.. వణికిపోయిన కుర్ర బౌలర్.!

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమిండియా వెటరన్ బ్యాటరన్ అజింక్యా రహానే(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) దుమ్మురేపాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన రహానే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వెటరన్ బ్యాటర్ అంబటి రాయుడు స్థానంలో జట్టులోకి వచ్చిన రహానే.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

ఎవరూ ఊహించని రీతిలో అసాధారణ బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కుర్ర బౌలర్ అర్షద్ ఖాన్‌ను మళ్లీ బౌలింగ్ చేయకుండా వణికించాడు. అతను వేసిన 4వ ఓవర్‌లో 6, 4, 4, 4, 4, 1 వరుస బౌండరీలతో 23 పరుగులు పిండుకున్నాడు. రహానే ధాటికి అర్షద్ ఖాన్ ముఖం మాడిపోయింది.

Ajinkya Rahane

ఇదే జోరులో రహానే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తాను ఎంతటి విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు. రహానే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. రహానే సంచలన బ్యాటింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అసాధారణ బ్యాటింగ్‌తో రహానే ఆకట్టుకున్నాడని కొనియాడుతున్నారు.

ఈ ఇన్నింగ్స్‌తో ఈ సీజన్ మొత్తం అతను తుది జట్టులో ఉంటాడని జోస్యం చెబుతున్నారు. అర్షద్ ఖాన్‌కు రహానే ఓ పీడకలను మిగిల్చాడని, అతని కెరీర్‌కు తన ఆటతో ఫుల్ స్టాప్ పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెంటేటర్లు సైతం రహానే బ్యాటింగ్ తీరును కొనియాడారు. రహానే చాలా ప్రతిభ కలిగిన ఆటగాడని చెప్పుకొచ్చారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టీమ్ డేవిడ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/20) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై.. రహానే విధ్వంసకర బ్యాటింగ్‌తో 12 ఓవర్లలోనే 108 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే ఉన్నారు. ఓపెనర్ డెవాన్ కాన్వే విఫలమైనా.. రహానే తన అసాధారణ బ్యాటింగ్‌తో చెన్నై విజయానికి బాటలు వేసాడు.

Story first published: Saturday, April 8, 2023, 22:42 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+