MI vs CSK: పనిచేసిన ధోనీ వార్నింగ్.. ఒక్క నోబాల్ వేయని చెన్నై బౌలర్లు!
హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మరో విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన చెన్నై.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగింది.
స్పిన్నర్లు రవీంద్ర జడేజా(3/20), మిచెల్ సాంట్నర్(2/28)లు ముంబై పతనాన్ని శాసిస్తే.. పేసర్లు తుషార్ దేశ్ పాండే(2/31), సిసండా మగలా(1/37) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పేసర్లు ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశారు. ఒక్క నోబాల్ కూడా వేయలేదు. ఎక్స్‌ట్రాలు కూడా 8 పరుగులు మాత్రమే ఇచ్చారు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన రెండో మ్యాచ్ అనంతరం ధోనీ.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బౌలింగ్‌ను మెరుగుపరుచుకోకుంటే.. కొత్త కెప్టెన్‌ను చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం తుషార్ దేశ్‌పాండేకు బౌలింగ్ ఎలా వేయాలో.. నో బాల్స్ వేయకుండా అనుసరించాల్సిన ట్రిక్స్ ఏంటో కూడా స్వయంగా తెలియజేశాడు. కాస్త గట్టిగానే అతన్ని మందలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ధోనీ ఆగ్రహంతో తుషార్ దేశ్‌పాండే ఒళ్లు దగ్గరపెట్టుకొని బౌలింగ్ చేశాడు.
మూడు ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. రోహిత్ శర్మ, టీమ్ డేవిడ్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. దాంతో ధోనీ వార్నింగ్ పని చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టీమ్ డేవిడ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై.. 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అజింక్యా రహానే(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications