ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.
'మేం బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వాంఖడే స్టేడియం మోస్ట్ మెమోరబుల్ గ్రౌండ్. 2011 వన్డే ప్రపంచకప్ గెలవడమే కాదు. 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం ఇక్కడే విజయోత్సవ సభ జరిగింది. సాధారణంగా ఇక్కడ బౌన్స్‌తో పాటు పేస్ ఉంటుంది.

జట్టును గాయాల బెడద వేధిస్తోంది. బెన్ స్టోక్స్ గాయపడగా.. మొయిన్ అలీ జట్టుకు అందుబాటులో లేడు. అజింక్యా రహానే, డ్వేన్ ప్రిటోరియస్ వారి స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు. 'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'మేం కూడా బౌలింగే ఎంచుకోవాలనుకున్నాం. ఇది మంచి పిచ్. బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే వికెట్. మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ కోసం మేం అద్భుతంగా ప్రిపేర్ అయ్యాం.
గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను చర్చించుకున్నాం. ఈ రోజు మేం ఆశించిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాం. దురదృష్టవశాత్తు జోఫ్రా ఆర్చర్ గాయపడ్డాడు. గాయం అనే కంటే ముందస్తు చర్యల్లో భాగంగానే అతన్ని ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచామని చెప్పవచ్చు. అతని స్థానంలో మరో ప్లేయర్‌ను ఎంచుకున్నాం.
చాలా రోజుల తర్వాత వాంఖడేలో ఆడటం గొప్ప అనుభూతి. ప్రేక్షకుల మద్దతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోగా.. చెన్నై ఓ మ్యాచ్‌లో ఓడి మరో మ్యాచ్‌లో గెలిచింది.
తుది జట్లు:
సీఎస్‌కే: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసండా మగల, తుషార్ దేశ్ పాండే.
ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టాన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్.