Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై vs చెన్నై మ్యాచ్ హైలెట్స్ .. ఆసక్తికర విషయాలు ఇవే!!

MI vs CSK Match Highlights, Interesting points about players

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు శుభారంభం లభించింది. గత సీజన్‌ ఫైనలిస్టుల మధ్య జరిగిన తొలి పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌దే పైచేయి అయింది. శనివారం షేక్‌ జాయేద్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆరు నెలలుగా క్రికెట్‌ మజాకు ముఖం వాచిపోయిన అభిమానులకు ధోనీసేన ఫుల్‌ జోష్‌నిచ్చింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగంలో ప్రత్యక ప్రదర్శనతో చెన్నై ఆగటగాళ్లు ఆకట్టుకున్నారు.

చావ్లా అనుభవం

చావ్లా అనుభవం

అబుదాబి పిచ్‌పై‌ చెన్నై పేసర్లు దీపక్ చాహర్, సామ్ కరన్‌ తేలిపోయిన సమయంలో 5వ ఓవర్లో బంతిని అందుకున్నాడు స్పిన్నర్ పీయూష్ చావ్లా. తన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కెప్టెన్ ధోనీ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ.. తొలి ఓవర్లోనే రోహిత్ (12)ను ఔట్ చేశాడు. సామ్ కరన్‌‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్.. లెగ్ స్పిన్ ఎదుర్కోవడంలో మరోసారి విఫలమయ్యాడు. ఈ ఒక్క ఓవర్ మాత్రమే కాదు మిగతా 3 ఓవర్లను బాగా వేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ మొత్తంలో తక్కువ పరుగులు ఇచ్చింది చావ్లానే.

డుప్లెసిస్ అద్భుతం

డుప్లెసిస్ అద్భుతం

చెన్నై ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతం చేశాడు. ఐదు బంతుల వ్యవధిలో రెండు అద్భుత క్యాచ్‌లను అందుకొని కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. బాగా బ్యాటింగ్ చేస్తున్న సౌరభ్ తివారీ (42) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ దగ్గర డుప్లెసిస్‌కు చిక్కాడు. వేగంగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న డుప్లెసిస్.. బౌండరీ లైన్ దాటేలోగా బంతిని లోపలికి విసిరి మళ్లీ మైదానంలోకి వచ్చి అందుకున్నాడు. ఇక రెండు సిక్సులు బాదిన హార్దిక్ పాండ్యా (14) ఇచ్చిన కాచును కూడా అదే ఓవర్లో డుప్లెసిస్ గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. ఇక్కడే ముంబైకి భారీ షాక్ తగిలింది.

ఎంగిడి సూపర్ స్పెల్‌

ఎంగిడి సూపర్ స్పెల్‌

తొలి రెండు ఓవర్లలో 29 పరుగులిచ్చి పూర్తిగా నిరాశపర్చిన లుంగీ ఎంగిడి.. సెకండ్ స్పెల్‌లో పుంజుకున్నాడు. రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో చివరి ఓవర్లలో ముంబై పరుగులు చేయలేకపోయింది. చివరి 6 ఓవర్లలో ముంబై ఆరు వికెట్లు కోల్పోవడంతో.. ఆ జట్టు డెత్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయింది. దీంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.

రాయుడు విరోచిన ఇన్నింగ్స్

రాయుడు విరోచిన ఇన్నింగ్స్

లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. షేన్ వాట్సన్,‌ మురళీ విజయ్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్ (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4)లు బ్యాట్ జులిపించారు. ముఖ్యంగా రాయుడు దూకుడుగా ఫోర్లు, సిక్సులు బాదుతూ టోర్నీ తొలి అర్ధ సెంచరీ బాదాడు. రాయుడు, డుప్లెసిస్ వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో చెన్నై విజయతీరాలకు చేరింది.

ఐపీఎల్ 2020లో ఆసక్తికర విషయాలు

ఐపీఎల్ 2020లో ఆసక్తికర విషయాలు

* తొలి ఓవర్ వేసింది దీపక్ చహర్.

* తొలి బౌండరీ బాదింది రోహిత్ శర్మ.

* తొలి వికెట్ తీసింది పీయూష్ చావ్లా.

* తొలి సిక్స్ బాదింది సౌరవ్ తివారి.

* తొలి అర్ధ శతకం బాదింది అంబటి రాయుడు.

* తొలి విజయం అందుకుంది చెన్నై.

* తొలి క్యాచ్ పట్టింది సామ్ కరన్‌.

* ధోనీ ఖాతాలో 100వ ఐపీఎల్ క్యాచ్.

* చెన్నై సారథిగా ధోనీకి 100వ విజయం.

ముంబైపై విజయం.. ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు!!

Story first published: Sunday, September 20, 2020, 12:06 [IST]
Other articles published on Sep 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+