Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK match 1: ముంబై ఇండియన్స్‌దే బ్యాటింగ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ సేన!

MI vs CSK match 1: Chennai Super Kings won the toss and choose to field first

అబుదాబి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అద్భుత క్షణం రానే వచ్చింది. జరుగుతుందో లేదో అనుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు ఎట్టకేలకు తెరలేచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబి వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి బౌలింగ్ ఎంచుకుంటున్నట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. విదేశీ ఆటగాళ్లలో డూప్లెసిస్, సామ్ కరన్, లుంగి ఎంగిడి, షేన్ వాట్సన్ తుది జట్టులోకి తీసుకున్నామన్నాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలి 6 రోజుల క్వారంటైన్ చాలా కష్టంగా గడిచిందని, ప్రాక్టీస్‌కు కల్పించిన వసతులు బాగున్నాయని చెప్పుకొచ్చాడు.

ఇక ఫ్లడ్‌లైట్స్ కింద ఆడే మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ చేయడం ఉత్తమమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని వారాలుగా ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చామని, ఇక్కడికి రాక ముందు ముంబై‌లో ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నమన్నాడు. మొత్తానికి ఐపీఎల్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని చెప్పుకొచ్చాడు. విదేశీ ఆటగాళ్లలో క్వింటన్ డికాక్, జెమ్స్ పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, కీరన్ పొలార్డ్‌లను తీసుకున్నామని తెలిపాడు.

ఇక ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. శుభారంభం కోసం పరితపిస్తున్నాయి. తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ముంబై ఇండియన్స్ భావిస్తుండగా.. గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్ల బలబలాల పరంగా సమంగానే ఉన్నా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే ఆ జట్టు గత 7 సీజన్లలో శుభారంభం చేయలేదు.

ఈ మ్యాచ్ గెలిచి తమపై ఉన్న స్లో స్టార్టర్ ముద్రను చెరపేసుకోవాలని​ భావిస్తోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడగా ముంబై 17 సార్లు, చెన్నై 11 సార్లు గెలిచింది. ఇక గత ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఆట కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

తుది జట్లు
చెనై సూపర్ కింగ్స్: మురళి విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జేమ్స్ పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, September 19, 2020, 19:31 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+