ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తేమ వచ్చే ప్రభావం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. తేమ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పిచ్ కూడా గత మ్యాచ్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా. బేసిక్స్‌కు కట్టుబడి ఆడాల్సిన అవసరం ఉంది. మూమెంటమ్ అందుకోవడానికి ఈ మ్యాచ్ గెలవడం మాకు చాలా కీలకం. గత రెండు మ్యాచ్‌లను మేం కన్విన్స్‌గా గెలిచాం. ఐపీఎల్ బ్యూటీనే అది. జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించారు. 10 ఓవర్లు పూర్తయిన వెంటనే డ్యూ రానుంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఎక్కువవనుంది. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. అయితే టాస్ గెలవడం అనేది మన చేతుల్లో లేని పని. మూడు విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. పడుతూ లేస్తూ సాగడం ఐపీఎల్ బ్యూటీ. ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉండనుంది. ఇరు జట్లు ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టును విజయం వరిస్తుంది. తీక్షన స్థానంలో పతీరణ వచ్చాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
ముఖా ముఖి:
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌ల్లో నెగ్గగా, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై మూడింట్లో విజయం సాధించింది.
తుది జట్లు
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ మహేంద్ర సింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే.
ఇంపాక్ట్ ప్లేయర్: మతీష పతీరణ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మద్వాల్
ఇంపాక్ట్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్