MI vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ మొత్తంను అతడినే కొనసాగిస్తా: కోహ్లీ

చెన్నై: ఐదు వికెట్లతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్‌పై ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, డెత్ ఓవర్ బౌలర్‌గా తనను సీజన్ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. ముంబైపై అందరూ సమిష్టిగా రాణించారని, ఇది జట్టు విజయం అని కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. చెపాక్‌వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన ఈసారి మాత్రం బోణీ కొట్టింది.

డెత్ ఓవర్లలో కొనసాగిస్తాం:
మ్యాచ్ విజయానంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి హర్షల్ పటేల్‌ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో తన సేవలు చక్కగా వినియోగించుకుంటాం. ఒక కెప్టెన్‌గా తన నుంచి నేనేం ఆశించానో.. ఆ అంచనాలను తను అందుకున్నాడు. జెమీసన్, చహల్, సిరాజ్ సైతం బాగా బౌలింగ్ చేశారు' అని అన్నాడు.

ముంబైపై ఐదు వికెట్లు:
శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో హర్షల్ పటేల్ అద్భుతం చేశాడు. ముంబైపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. తన కోటా 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (13), కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7) లాంటి హార్డ్ హిట్టర్లతో పాటు మార్కో జాన్సన్ (0)ను హర్షల్ పెవిలియన్ పంపించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం ఒక పరుగే ఇవ్వడం గమనార్హం. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన హర్షల్ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

98 టీ20ల్లో ఇదే తొలిసారి:
ఢిల్లీ నుంచి బదిలీ చేసుకున్నప్పుడే ఆఖరి ఓవర్లు వేయాల్సి ఉంటుందని బెంగళూరు జట్టు యాజమాన్యం చెప్పిందని హర్షల్ పటేల్ తెలిపాడు. చివరి ఓవర్లు కట్టుదిట్టంగా విసిరేందుకు రెండుమూడేళ్లుగా శ్రమిస్తున్నానని వెల్లడించాడు. 'బెంగళూరుకు ఆడటం సంతోషంగా ఉంది. జట్టు యాజమాన్యం నాపై విశ్వాసం ఉంచింది. కచ్చితత్వంతో బంతులు వేయడంపైనే దృష్టి పెట్టా. ఎందుకంటే జోరు కొనసాగించడం కీలకం. నేనాడిన 98 టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇదే తొలిసారి. అదీ ముంబైపై కావడం మరింత ప్రత్యేకం. బాధ్యత తీసుకొనే బౌలర్‌గా ఉండాలన్నదే నా లక్ష్యం' అని హర్షల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021: ముంబై vs బెంగళూరు మ్యాచులో నమోదైన గణాంకాలు ఇవే!!