Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Team For IPL 2022: టాప్ క్లాస్ స్పిన్నర్లు లేరు.. బలహీనంగా రోహిత్ సేన.. తుది జట్టు అంచనా ఇదే!

MI Team For IPL 2022: Mumbai Indians Playing 11, Batting, Bowling And Complete Review

హైదరాబాద్: ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడటం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)‌లో ముంబై ఇండియన్స్‌‌ శైలి‌ ఇది. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఎనిమిది సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్‌‌ నెగ్గింది. ఈ ఐదు ట్రోఫీలు‌ రోహిత్‌‌ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం. దిగ్గజ‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ తర్వాత అంతటి ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌‌గా పేరు తెచ్చుకున్న హిట్‌‌మ్యాన్‌.. ఐపీఎల్ రికార్డులతోనే టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. పరిస్థితులు అనుకూలించక గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సారి మళ్లీ టైటిల్ కొట్టి తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలనుకుంటుంది.

ఆక్షన్‌లో అట్టర్ ఫ్లాఫ్..

ఆక్షన్‌లో అట్టర్ ఫ్లాఫ్..

అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్.. మెగా ఆక్షన్ వల్ల చెల్లాచెదురైంది. నలుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. పాత ఆటగాళ్లను వేలంలో తిరిగి దక్కించుకోలేకపోయింది. కేవలం ఒక్క ఇషాన్ కిషన్‌ను మాత్రం ఎంపిక చేసుకుంది. అతని కోసం ఎన్నడూ లేని విధంగా రూ.15.25 కోట్లు ఖర్చు పెట్టింది. వేలంలో ఓ ఆటగాడి కోసం ముంబై రూ. 10 కోట్లు ధాటి ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా అప్ కమింగ్ సీజన్ ఆడని జోఫ్రా ఆర్చర్‌ను భవిష్యత్తు కోసం కొనుగోలు చేసింది. అతని కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. ఇక హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ డేవిడ్‌ను తీసుకున్న ముంబై.. అతని కోసం రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది. దాంతో ఈ ముగ్గురు ఆటగాళ్ల కోసం ముంబై పర్స్ మనీలో నుంచి రూ.33.5 కోట్లు ఖర్చు పెట్టింది.

ఏడుగురే టాప్ క్లాస్ ప్లేయర్స్..

ఏడుగురే టాప్ క్లాస్ ప్లేయర్స్..

దాంతో పర్స్‌లో డబ్బులు లేక అనామక ఆటగాళ్లతో మిగతా స్లాట్స్‌ను నింపేసింది. రిటైన్ చేసుకున్న నలుగురు, ఈ ముగ్గురుతో మొత్తం ఏడుగురే ప్రధాన ఆటగాళ్లు ఉండగా.. మిగతా అంతా అనామక, సాధారణ ప్లేయర్లే కావడం విశేషం. ట్రెంట్ బౌల్ట్ వంటి తమ పాత ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రయత్నించినా ముంబై బడ్జెట్ సహకరించలేదు. దాంతో హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ, రాహుల్ బుద్దిలతో పాటు మహమ్మద్ అర్షద్ ఖాన్, హ్రితీక్ షోకీన్, ఆర్యన్ జుయాల్, రమన్ దీప్ సింగ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, అర్జున్ టెండూల్కర్, సంజయ్ యాదవ్, బసిల్ థంపీలను తీసుకుంది. ఓవర్ సీస్ జాబితాలో సౌతాఫ్రికా సెన్సేషన్, జూనీయర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్‌ల, డానియల్ సామ్స్, టైమల్ మిల్స్‌, రిలేమెరిడిత్‌‌, ఫాబియన్ అలెన్‌లను ఎంచుకుంది. టాప్ క్లాస్ స్పెషలిస్ట్ స్పిన్నర్లను ముంబై తీసుకోలేకపోయింది. మురగన్ అశ్విన్, మయాంక్ మార్కండే వంటి దేశవాళీ ఆటగాళ్లపై నమ్మకం ఉంచింది.

అనామక ఆటగాళ్లే స్టార్లుగా..

అనామక ఆటగాళ్లే స్టార్లుగా..

అయితే ముంబై ఇండియన్స్ ఎప్పుడూ అనామక ఆటగాళ్లను స్టార్లుగా మార్చి మంచి టీమ్‌ను తయారు చేసుకుంటుంది. వాళ్లు తీసుకునే అనామక ఆటగాళ్లపై ఆ టీమ్ సపోర్ట్ స్టాఫ్ మంచి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. గతంలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లంతా ముంబైలోకి అనామక ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదిగినవారే. కాబట్టి ఆ జట్టు పేపర్‌పై బలహీనంగా కనిపిస్తున్నా.. టోర్నీ సమయానికి స్ట్రాంగ్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ‌కు మంచి ఫ్యూచర్ ఉండనుంది. అనామక ఆటగాళ్లంతా స్టార్లుగా మారే చాన్సుంది.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..

ఇక ముంబై ఇండియన్స్ తుది జట్టు అంచనా వేస్తే.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ బ్యాటింగ్ చేయనున్నారు. గత రెండు మూడేళ్లుగా తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అతను సత్తా చాటితే స్టార్ ప్లేయర్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఐదు, ఆరో స్థానంలో హిట్టర్లు కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్ బ్యాటింగ్ చేయనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ డానియల్ సామ్స్‌కు అవకాశం దక్కవచ్చు. తిలక్ వర్మతో పాటు సూర్య, టీమ్ డేవిడ్ స్పిన్ బౌలింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో స్పిన్నర్‌ను ముంబై తీసుకోకపోవచ్చు. స్పిన్ కండిషన్స్‌లో ఆడితే మాత్రం డానియల్ సామ్స్‌కు ఫాబియన్ అలెన్ జట్టులోకి రావచ్చు. పేసర్లు జయదేవ్ ఉనాద్కత్, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు రిలే మెరిడిత్, టైమల్ మిల్స్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది. లెగ్ స్పిన్నర్‌గా మురుగన్ అశ్విన్ లేదా మయాంక్ మార్కండేలో ఒకరికి చోటు దక్కవచ్చు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్/ ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, రిలే మెరిడిత్/మిల్స్

ముంబై పూర్తి టీమ్:

ముంబై పూర్తి టీమ్:

రోహిత్ శర్మ(రూ.16 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్(రూ.6 కోట్లు), ఇషాన్ కిషన్(రూ.15.25 కోట్లు), టీమ్ డేవిడ్(రూ.8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్(రూ.8 కోట్లు), డేవాల్డ్ బ్రేవిస్(రూ.3 కోట్లు), డానియల్ సామ్స్(రూ.2.60 కోట్లు), తిలక్ వర్మ(రూ.1.70), మురుగన్ అశ్విన్(రూ.1.60 కోట్లు), టైమల్ మిల్స్ (రూ.1.50 కోట్లు), జయదేవ్ ఉనాద్కత్(రూ.1.30 కోట్లు), రిలే మెరిడిత్(రూ. కోటి), ఫాబియన్ అలెన్(రూ.75 లక్షలు), మయాంక్ మార్కండే(రూ.65 లక్షలు), సంజయ్ యాదవ్(రూ.50 లక్షలు), బసిల్ థంపీ(రూ.30 లక్షలు), అర్జున్ టెండూల్కర్(రూ.30 లక్షలు), అన్మోల్ ప్రీత్ సింగ్(రూ.20 లక్షలు), రమన్ దీప్ సింగ్(రూ.20 లక్షలు), ఆర్యన్ జుయల్(రూ.20 లక్షలు), రాముల్ బుద్ది(రూ.20 లక్షలు), హ్రితీక్ షోకీన్(రూ.20 లక్షలు), మహమ్మద్ అర్షద్ ఖాన్(రూ.20 లక్షలు),

Story first published: Sunday, February 20, 2022, 16:00 [IST]
Other articles published on Feb 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+