ఐపీఎల్ డబ్బులన్నీ ఆయనకే ఇచ్చేసా: తిలక్ వర్మ

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా సంపాదించిన డబ్బులన్నిటినీ తన తండ్రికి ఇచ్చేసానని తెలుగు తేజం, ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. డబ్బుకు ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి ఉందని, అందుకు తానేమి అతీతుడనేమి కాదన్నాడు. అందుకే వాటిని తనకు దూరంగా ఉంచమని చెప్పానని తెలిపాడు. ఐపీఎల్‌లో ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణంగా విఫలమైనా.. ఆ జట్టు బ్యాటింగ్‌కు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ వెన్నెముకలా నిలిచాడు. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ మెగా వేలంలో తిలక్ వర్మను ముంబై రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది.

బస్‌లో నుంచి గెంటేసారు..
అయితే ఒకేసారి అంత డబ్బు రావడంతో తాను ఏం మారిపోలేదని.. అవన్నీ తన తండ్రికే ఇచ్చి కేవలం తన ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ తెలిపాడు. 'నేను క్రికెట్ నేర్చుకుని అండర్-16 కు ఆడుతున్న క్రమంలో చాలా కష్టాలు పడ్డాను. ఆ రోజులను నేనెప్పటికీ మరిచిపోలేను. నా క్రికెట్ కిట్‌తో కొన్నిసార్లు బస్ కూడా ఎక్కనిచ్చేవారు కాదు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత నేను ఇంటిని దాదాపుగా మరిచిపోయాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నదానికి నేను చాలా కోల్పోయాను. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీతో గడపడం అన్నీ త్యాగం చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన సోదరి పెళ్లికి కూడా నేను హాజరుకాలేకపోయాను.

అన్నం లేకున్నా సరే..
ఇప్పుడంటే నాకు అన్నీ ఉన్నాయి. ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్లాలంటే బస్‌లో వెళ్లాల్సిన పని లేదు. నాకున్న సంపాదనతో నేను సొంతగా కార్ కొనుక్కోవచ్చు. అండర్-16 టీమ్‌కు ఆడుతున్నప్పుడు ఉదయం 6 గంటలకే గ్రౌండ్‌కు వెళ్లేవాడిని. ఎప్పుడో సాయంత్రమైతే తప్ప ఇంటికి రాకపోయేవాడిని. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉండేది. క్యాంప్‌నకు వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు.

డబ్బుకు మార్చే శక్తి ఉంది..
అన్నం, రెస్ట్ వంటివైనా మిస్ చేసుకునేవాడిని గానీ ప్రాక్టీస్ అయితే మిస్ కాలేదు. డబ్బుకు ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి ఉంది. అందుకు నేనేమీ అతీతుడనేమీ కాదు. అందుకే నా డబ్బులన్నీ మా నాన్నకు ఇచ్చేవాడిని. అవి నా కంట పడకుండా చూడమని చెప్పేవాడిని.'అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications