Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: పవర్‌ఫుల్‌గా ముంబై ఇండియన్స్.. పూర్తి జట్టు ఇదే!

IPL 2024 వేలంలో ముంబై ఇండియన్స్ చాలా తెలివిగా వ్యవహరించింది. తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం.. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 17.75 కోట్ల పర్స్ మనీతో బరిలోకి దిగింది. తక్కువ డబ్బే ఉన్నా.. 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇందులో నలుగురు ఓవర్‌సీ ఆటగాళ్లు ఉండటం విశేషం. జోఫ్రా ఆర్చర్‌కు రిప్లేస్‌మెంట్‌గా సౌతాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీని తీసుకుంది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ మరీ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే మరో ఓవర్‌సీస్ పేసర్ స్లాట్‌ను భర్తీ చేసేందుకు జూనియర్ మలింగగా గుర్తింపు పొందిన శ్రీలంక బౌలర్ నువాన్ తుషార్‌ను రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది.

MI squad IPL 2024: Mumbai Indians full list of players after auction

స్పిన్ ఆల్‌‌రౌండర్ కోటాలో అఫ్గానిస్థాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని రూ. కోటి 50 లక్షలకు తీసుకుంది. బ్యాకప్ ప్లేయర్లుగా దేశవాళీ ఆటగాళ్లను రూ. 20 లక్షల కనీస ధరకు తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల సంఖ్య మొత్తం 25‌కు చేరుకోగా.. ఇంకా ఆ జట్టు పర్స్‌లో రూ.1.05 కోట్లు ఉన్నాయి. వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది.

నూతన కెప్టెన్‌గా అతన్ని నియమించింది. ట్రేడింగ్ విండో ద్వారా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తెచ్చుకుంది. రూ. 50 లక్షల అతని కనీస ధరకు తీసుకుంది. హార్దిక్ పాండ్యా కోసం కామెరూన్ గ్రీన్‌ను ఆర్‌సీబీకి ట్రేడ్ చేసిన ముంబై ఇండియన్స్.. వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
గెరాల్డ్ కోయిట్జీ-రూ. 5 కోట్లు
దిల్షాన్ మధుషంక-రూ. 4.6 కోట్లు
శ్రేయస్ గోపాల్- రూ. 20 లక్షలు
నువాన్ తుషార్- రూ. 4.8 కోట్లు
నమాన్ ధిర్- రూ. 20 లక్షలు
అన్షుల్ కంబోజ్- రూ. 20 లక్షలు
మహమ్మద్ నబీ- రూ.1.50 లక్షలు
శివాలిక్ శర్మ- రూ. 20 లక్షలు

ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్:
రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).

Story first published: Wednesday, December 20, 2023, 14:50 [IST]
Other articles published on Dec 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+