ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. నిన్నటి(క్వాలిఫయర్-1 మ్యాచ్ పిచ్ కంటే) పోల్చితే ఈ వికెట్ భిన్నంగా కనిపిస్తోంది. పిచ్‌పై గడ్డి తక్కువగా ఉంది. పెద్ద మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోవడం ఉత్తమం. గత 9 మ్యాచ్‌లను మేం నాకౌట్ తరహాలోనే ఆడాం. ఈ రోజు తప్పకుండా రాణించాలి. మా నియంత్రణలో ఉన్న విషయాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలి. మా జట్టులో మూడు మార్పులు చేశాం. జానీ బెయిర్ స్టో తిరిగి రాగా.. గ్లీసన్ అరంగేట్రం చేస్తున్నాడు. రాజ్ అంగద్ బావా కూడా ఆడుతున్నాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 'మేం ఛేజింగ్ చేసేవాళ్లం. ఈ సీజన్ ఆరంభంలో ఎవరైనా మేం ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతామని చెప్పి ఉంటే.. మేం దాన్ని అంగీకరించలేవాళ్లం. తిరిగి చండీగఢ్‌కు రావడం పట్ల కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది నా హోమ్ గ్రౌండ్. ఈ మ్యాచ్ మాకు భిన్నంగా ఏమీ లేదు. నాకౌట్ గేమ్ అనే ఒత్తిడి లేదు. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. జోస్ బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్, అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ