
రిటెన్షన్ రూల్స్ ఇవే..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది. గత కొన్నేళ్లుగా జట్టులో ఉంటూ ఒకరికొకరు మమేకమైన ఆటగాళ్లంతా చెల్లా చెదురు కానున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తీసుకోవాలనేది కూడా ఫ్రాంచైజీలకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే అత్యంత పటిష్టమైన ముంబై ఇండియన్స్ టీమ్
రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్.. తమ కెప్టెన్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకునే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్.. ముంబైకి ఏకంగా ఐదు టైటిళ్లు అందించాడు. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రోహిత్‌ను ముంబై ఎంచుకోనుంది. ఆ ప్రకారం హిట్ మ్యాన్ రూ.16 కోట్ల వేతనాన్ని అందుకోనున్నాడు. అయితే గత సీజన్ కంటే ఒక కోటి ఎక్కువగానే అందుకోనున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో హిట్ మ్యాన్ రూ.15 కోట్ల వేతనాన్ని తీసుకున్నాడు. పైగా ఇప్పుడు హిట్ మ్యాన్ టీమిండియా కెప్టెన్ కావడంతో అతని క్రేజీ అమాంతం పెరిగింది. అది జట్టుకు కూడా లాభించనుంది. 2013 నుంచి రోహిత్ శర్మ ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే.

జస్‌ప్రీత్ బుమ్రా
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సైతం ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుంది. ఈ తరం క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ పేసర్. టీ20 ఫార్మాట్‌లో అతని బౌలింగ్ అసాధారణం. ఈ యార్కర్ల కింగ్ ఇప్పటికే 106 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23.1 సగటుతో 130 వికెట్లు తీశాడు. ముంబై విజయాల్లో బుమ్రాది కీలక పాత్ర. 2013లో ముంబై తరఫునే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించిన బుమ్రా.. అనతి కాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు. లసిత్ మలింగా రిటైర్మెంట్ తర్వాత ముంబైకి ఆ స్థాయి కలిగిన జస్‌ప్రీత్ బుమ్రా సేవలు అవసరం. తదుపరి సీజన్లలో రాణించాలంటే అతను జట్టులో ఉండాల్సిందే. ఈ సారి అతన్ని ముంబై రెండో స్లాబ్ ప్లేయర్‌గా రూ.12 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకునే చాన్సుంది. దాంతో అతని సాలరీ ఏకంగా రూ. 5 కోట్లు పెరగనుంది.

కీరన్ పొలార్డ్..
ముంబై సగం బలం వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ కీరన్ పొలార్డ్. రోహిత్, బుమ్రా, ఒక ఎత్తు అయితే.. పోలార్డ్ ఒక్కడే మరో ఎత్తు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఎన్నో చిరస్మరణీ విజయాలందుకుంది. విదేశీ కోటాలో ముంబై అతన్ని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. పైగా పొలార్డ్ ముంబై వైస్ కెప్టెన్. రోహిత్ గైర్హాజరీలో జట్టును నడిపించగల సమర్థుడు. 2010 నుంచి ముంబైకే ఆడుతున్న పొలార్డ్.. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో విజయాలందించాడు. 178 ఐపీఎల్ మ్యాచ్‌లో 3268 రన్స్‌తో 65 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో రాణించినా.. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో విఫలమయ్యాడు. అది జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. ఇక కీరన్ పొలార్డ్‌న మూడో స్లాబ్ ప్లేయర్‌గా రూ.8 కోట్లు చెల్లించి ముంబై రిటైన్ చేసుకునే చాన్సుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ. 5.4 కోట్లు వేతనం అందుకున్న పొలార్డ్.. కోటి 20 లక్షలు ఎక్కువగా తీసుకోనున్నాడు.

హార్దిక్ ఔట్.. సూర్య డౌట్..
ఇక నాలుగో ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే చాన్సుంది. దాంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నిష్క్రమణ తప్పేలా లేదు. గత కొంత కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న హార్దిక్ భారత జట్టులో కూడా చోటు కోల్పోయాడు. దాంతో ముంబై కూడా అతనిపై ఆసక్తి కనబర్చడం లేదు. అయితే మూడో స్లాబ్ ప్లేయర్‌గా రూ. 6 కోట్లకు సూర్య రిటెన్షన్‌కు అంగీకరిస్తాడా? అనేది సందేహం. కొత్త జట్లు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సూర్య రిటెన్షన్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












