Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: లక్నోపై భారీ విజయం.. ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. సోమవారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరమైన స్థితిలో ముంబై ఇండియన్స్ భారీ విజయాన్నందుకోవడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా దుమ్మురేపడం.. 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో అదృష్టం కలిసి వస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవచ్చని ముంబై ఫ్యాన్స్ భావిస్తున్నారు.

10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే అయినా.. ఆ జట్టు ఇంకా అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకోలేదు. అద్భుతం జరిగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.

IPL 2026: వదిన-మరదళ్లకు వింత అనుభవం!

IPL 2026: వదిన-మరదళ్లకు వింత అనుభవం!

ముంబైకి ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయా..?

ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. ముంబై ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు 4 గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్స్ చేరుతాయి. 10 జట్లను ప్రవేశపెట్టిన తర్వాత 14 పాయింట్స్‌తో ఆర్‌సీబీ మాత్రమే ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అలా ముంబై ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే ఇతర జట్ల ఫలితాలు కూడా ముంబైకి కలిసి రావాలి.

ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ ఐదు జట్లు మరో 2 విజయాలు సాధించినా ముంబై వారిని అందుకోలేదు.

MI Playoff Scenarios How Mumbai Indians Can Still Qualify for IPL 2026 Playoffs After Thumping LSG

ముంబై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఏం జరగాలి?

1. ముంబై ఇండియన్స్ మిగిలిన నాలుగు మ్యాచ్‌లను భారీ రన్ రేట్ తేడాతో గెలవాలి.

2. RCB, SRH, RR, GT జట్లలో కనీసం రెండు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు. ఒకవేళ PBKS తమ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. పైన పేర్కొన్న నాలుగు జట్లలో ఏదైనా ఒకటి ముందంజ వేసినా ముంబై ఇండియన్స్‌కు అవకాశం ఉంటుంది.

3. MI తమ మిగిలిన మ్యాచ్‌లను RCB, PBKS, RR జట్లతో ఆడాల్సి ఉంది. దీనివల్ల ఆయా జట్ల నుంచి పాయింట్లను లాక్కోవడానికి ముంబైకి నేరుగా అవకాశం లభిస్తుంది. మూడు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్నా.. నాలుగో ప్లేస్ కోసం పోటీపడే జట్లు 14 పాయింట్స్‌తో ముంబై కంటే తక్కువ రన్‌రేట్‌తో నిలవాలి. అప్పుడు ముంబై ఇండియన్స్‌కు నాలుగో బెర్త్ దక్కుతుంది. ఇదంతా జరగాలంటే ముంబైకి లక్ కలిసిరావాలి.

ప్రస్తుతం ముంబైకి తమ సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే RCB, PBKS‌లతో జరిగే మ్యాచ్‌లు ఆయా జట్ల ప్రధాన స్టేడియాల్లో కాకుండా రాయ్‌పూర్, ధర్మశాల వంటి తటస్థ వేదికల్లో జరగడం ముంబైకి కొంత ఊరటనిచ్చే అంశం.

సన్‌రైజర్సే ఛేజ్‌ చేసినప్పుడు.. మేం చేయలేమా అనిపించింది: సూర్యకుమార్ యాదవ్

సన్‌రైజర్సే ఛేజ్‌ చేసినప్పుడు.. మేం చేయలేమా అనిపించింది: సూర్యకుమార్ యాదవ్
Story first published: Tuesday, May 5, 2026, 10:46 [IST]
Other articles published on May 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+