Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI: రోహిత్ శర్మ దూరం.. సన్‌రైజర్స్‌తో తలపడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సోమవారం వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింటిలో ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరలేదు. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయిట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబైని ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటుంది.

MI Playing XI vs SRH Rohit Sharma and Jasprit Bumrah likely to rest for upcoming IPL 2024 Match

ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. తీవ్రంగా నిరాశపరిచాడు.

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతను రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతనితో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ దూరమైతే ఇషాన్ కిషన్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ చేస్తాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్ బరిలోకి దిగుతాడు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.

MI Playing XI vs SRH Rohit Sharma and Jasprit Bumrah likely to rest for upcoming IPL 2024 Match

నమన్ ధిర్ తుది జట్టులో వస్తాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్ మిడిలార్డర్‌లో ఆడనుండగా.. గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, నువాన్ తుషారా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నమన్ ధిర్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా/ఆకాష్ మధ్వాల్, నువాన్ తుషారా

Story first published: Sunday, May 5, 2024, 18:01 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+