ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరిగే తమ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శుభారంభం చేసిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలనే కసితో ముంబై ఇండియన్స్ ఉంది. అనారోగ్యం కారణంగా ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్‌తో బరిలోకి దిగనున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ తుది జట్టులో రెండు మార్పులు జరగనున్నాయి.

హార్దిక్ పాండ్యా బరిలోకి దిగితే.. అతని స్థానంలో ఆడిన దీపక్ చాహర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అంతేకాకుండా కార్బిన్ బోష్‌పై వేటు పడనుంది. అతని స్థానంలో ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. హార్దిక్ గైర్హాజరీలో బ్యాటింగ్ డెప్త్ కోసం కార్బిన్ బోష్‌ను ఆడించాడు. ఈ రెండు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ ఫినిషర్లు బరిలోకి దిగనున్నారు. మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దినున్నారు. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. మయాంక్ మార్కండే, అశ్వని కుమార్‌లో ఒకరికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఛాన్స్ ఉంది.
అయితే బర్సపారా స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఆడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్, తిలక్ వర్మ, బుమ్రా, వైభవ్ సూర్యవంశీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆర్చర్ వేసిన మూడు వరుస బంతులను తిలక్ సిక్సర్లుగా మలిచాడు. ఆర్చర్ బౌలింగ్‌లో తిలక్ స్ట్రైక్ రేట్ ఏకంగా 257గా ఉంది. ముంబై ఇండియన్స్ గత కొన్ని మ్యాచ్‌లుగా బుమ్రాను పవర్‌ప్లేలో ఎక్కువగా వాడుతోంది. సూర్యవంశీ, జైస్వాల్‌లను అడ్డుకోవడానికి బుమ్రానే ముంబైకి ప్రధాన ఆయుధం కానున్నాడు.
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే/అశ్వని కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా.