Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సూర్య ఇన్.. హార్దిక్ డౌట్! ఆర్‌సీబీతో తలపడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాయ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ ఆత్మగౌరవం కోసం ఆడుతోంది.

వరుసగా మూడు పరాజయాల తర్వాత లక్నోతో గత మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో ముంబై ఇండియన్స్‌పై ఒత్తిడి కూడా ఏం లేదు. స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించనుంది.

ఆర్‌సీబీకి అగ్ని పరీక్ష..

మరోవైపు వరుసగా గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్‌సీబీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ గెలవడం ఆర్‌సీబీకి కీలకంగా మారింది. ఇందులో ఓడితే ఆ జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో పాటు ఒత్తిడి పెరగనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. మరోసారి ముంబైని ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరువవ్వాలనే లక్ష్యంతో ఆర్‌సీబీ ఉంది.

MI Playing XI vs RCB Suryakumar Yadav Returns as Hardik Pandya Faces Late Fitness Test

హార్దిక్ పాండ్యా డౌట్..

వెన్ను నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ‌పై సందేహం నెలకొంది. అతని ఫిట్‌నెస్‌పై క్లారిటీ లేదు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా హార్దిక్ పాల్గొనలేదు. మరోవైపు ఇటీవలే తండ్రైన సూర్యకుమార్ యాదవ్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ప్రసవ సమయంలో తన సతీమణితో ఉండేందుకు సూర్య జట్టును వీడాడు. అతను ఆదివారం తిరిగి జట్టులో చేరుతాడని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించకపోతే సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ముంబై జట్టును నడిపించనున్నాడు. అప్పుడు ట్రెంట్ బౌల్ట్ బెంచ్‌కు పరిమితం కానుండగా.. కార్బిన్ బోష్ జట్టులో కొనసాగనున్నాడు. మరోవైపు ఆర్‌సీబీకి ఫిల్ సాల్ట్ అందుబాటులోకి రాలేదు. జాకోబ్ బెతెల్ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. తుది జట్టులో మార్పులు లేకుండా ఆర్‌సీబీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

తుది జట్లు(అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 1.విరాట్ కోహ్లీ, 2. జాకబ్ బెథెల్, 3. దేవదత్ పడిక్కల్, 4 రజత్ పాటిదార్ (కెప్టెన్), 5 జితేష్ శర్మ (వికెట్ కీపర్), 6 టిమ్ డేవిడ్, 7 రొమారియో షెపర్డ్, 8 కృనాల్ పాండ్యా, 9 భువనేశ్వర్ కుమార్, 10 జోష్ హేజిల్‌వుడ్, 11 సుయాష్ శర్మ, 12 రసిక్ సలామ్.

ముంబై ఇండియన్స్ :1 రోహిత్ శర్మ, 2 ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), 3 నమన్ ధీర్, 4 సూర్యకుమార్ యాదవ్, 5 తిలక్ వర్మ, 6 హార్దిక్ పాండ్యా (కెప్టెన్)/కోర్బిన్ బోష్, 7 రాబిన్ మింజ్/రాజ్ బావా, 8 దీపక్ చాహర్, 9 ట్రెంట్ బౌల్ట్, 10 ఏఎం గజన్ఫర్, 11 జస్ప్రీత్ బుమ్రా, 12 రఘు శర్మ.

Story first published: Sunday, May 10, 2026, 7:05 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+