Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI: రోహిత్ శర్మ ఔట్? లక్నోతో తలపడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. లక్నో వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. తమకు అలవాటైన రీతిలోనే వరుస ఓటములతో ఈ సీజన్‌‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయం ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా గత మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది. ఢిల్లీతో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న లక్నో.. సన్‌రైజర్స్‌పై ఘన విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో చిత్తయ్యింది. ఈ క్రమంలోనే ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

MI Playing XI vs LSG For IPL 2025 Rohit Sharma Out Or Unchanged Combination

బుమ్రా రీఎంట్రీ ఆలస్యం..
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. ఇది ఆ జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోపు బుమ్రా అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అతను సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ముంబై ఇండియన్స్‌కు సమస్యగా మారింది.

రోహిత్ శర్మపై వేటు..
గత మ్యాచ్‌లో అశ్వని కుమార్ సంచలన ప్రదర్శన కనబర్చడం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చింది. అతనితో పాటు విజ్ఞేష్ పుతుర్ సైతం వాల్యూబుల్ ప్లేయర్‌గా మాట్లాడాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను ముంబై ఇండియన్స్ మార్చకపోవచ్చు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. పేలవ ఫామ్‌ ముంబై ఇండియన్స్‌కు నష్టం చేస్తోంది. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కేకేఆర్‌పై హాఫ్ సెంచరీ సాధించి ఫామ్ అందుకున్నాడు. రోహిత్ శర్మ కూడా చెలరేగితే ముంబైకి తిరుగుండదు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. వరుస మ్యాచ్‌ల నేపథ్యంలో అతన్ని తుది జట్టులో నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ముంబై మేనేజ్‌మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు.

విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిడిలార్డర్‌లో ఆడనున్నారు. మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విజ్ఞేష్ పుతుర్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ విభాగం నిప్పులు చెరిగింది. అశ్వని కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. ముందుగా ఫీల్డింగ్ చేస్తే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా): ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విజ్ఙేష్ పుతుర్.

Story first published: Thursday, April 3, 2025, 17:39 [IST]
Other articles published on Apr 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+