ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫ్లాఫ్ షో కనబరుస్తున్న ముంబై ఇండియన్స్.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. లక్నో వేదికగా మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో హార్దిక్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం ముంబై ఇండియన్స్‌కు తప్పనిసరి.
ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ మూడింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానం కోసం ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడుతోంది. ముంబై ఇండియన్స్ ఇంకా 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ ఐదు మ్యాచ్‌లకు ఐదింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా గత మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ముంబై ఇండియన్స్ తుది జట్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. విరేచనాలతో గత మ్యాచ్‌కు దూరమైన గెరాల్డ్ కోయిట్జీ అందుబాటులోకి రానున్నాడు.
దాంతో లూక్ వుడ్‌పై వేటు పడనుంది. మరోవైపు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని కూడా తప్పించవచ్చు. అతని స్థానంలో ఓ ఇండియన్ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. లేదంటే డెవాల్ట్ బ్రెవిస్, రోమారియో షెఫర్ట్‌ల్లో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు.
మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.
స్పిన్నర్లుగా మహమ్మద్ నబీ, పియూష్ చావ్లా కొనసాగనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, నువాన్ తుషారా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, నువాన్ తుషారా