MI Playing XI: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం తమ సొంత మైదానం వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఐదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సారి ఆ కల నెరవేర్చుకోవాలనే కసితో ఉంది. వేలానికి ముందే ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టును పటిష్టం చేసుకుంది. ఆన్‌పేపర్‌పై ముంబై ఇండియన్స్ మిగతా 9 జట్ల కంటే పటిష్టంగా ఉంది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లతో భీకరంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ఏఐ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ ముంబై ఇండియన్సే విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాయి. గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. ఫైనల్ చేరకుండానే హార్దిక్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజేతగా నిలవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ ఉంది.

అయితే స్టార్ ఆల్‌రౌండర్స్ విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్‌లు కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నారు. ఈ ఇద్దరూ ఇంకా ముంబై ఇండియన్స్ జట్టుతో కలవలేదు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సాంట్నర్.. చివరి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతను ఇంకా ముంబై ఇండియన్స్ జట్టులో చేరలేదు. ఎప్పుడు చేరుతారనే విషయంపై క్లారిటీ లేదు.
మరోవైపు విల్ జాక్స్ వ్యక్తిగత కారణాలతో ఇంకా భారత్‌కు రాలేదు. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఇద్దరి గైర్హాజరీ ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురు దెబ్బే. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం వీరికి ఉంది. సాంట్నర్ స్థానంలో అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఆడనుండగా.. విల్ జాక్స్ స్థానంలో మయాంక్ మార్కండేను ఆడించవచ్చు.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ర్యాన్ రికెల్టన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సూర్య, తిలక్ వర్మ, నమన్ ధీర్ మిడిలార్డర్‌లో ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. మయాంక్ మార్కండే, అల్లా గజన్‌ఫర్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా అశ్వని కుమార్, అథర్వ అంకోలేకర్, ర్యాన్ రికెల్టన్‌లో ఒకర్ని ఆడించవచ్చు.
రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్/ర్యాన్ రికెల్టన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అల్లా గజన్‌ఫర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.ముంబై
రోహిత్ శర్మ, డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, డానిష్ మలేవార్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, శాంట్నర్, రాజ్ బజ్వా, కార్బిన్ బాష్, శార్దూల్, మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, నామన్ ధిర్, బుమ్రా, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, బౌల్ట్, మహ్మద్ ఇజార్, అల్లా ఘజన్ఫర్, రఘు శర్మ, మార్కండే.