Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI vs GT: వ్యూహాత్మక మార్పు.. క్వాలిఫయర్-2లో గుజరాత్‌తో ఆడే ముంబై జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇదే జోరును క్వాలిఫయర్-2లో కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు చెన్నై చేతిలో క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్.. క్వాలిఫయర్-2లో గెలిచి ఫైనల్ చేరాలనుకుంటుంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.

Rohit Sharma

అయితే ఇరు జట్ల మధ్య హెడ్ హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే 2-1తో ముంబైదే పై చేయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో ముంబై గెలవగా.. ఒక్కదాంట్లో మాత్రమే గుజరాత్ విజయాన్నందుకుంది. ఈ ఏడాది జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో చెరొకటి గెలిచాయి. అహ్మదాబాద్ పిచ్ పేస్ బౌన్స్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. తేమ ప్రభావం ఏ మాత్రం ఉండే అవకాశం లేదు.

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ తరహాలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగనుంది. నెహాల్ వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనుంది. గత మ్యాచ్‌లో విఫలమైన హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తీకేయ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా టీమ్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. గుజరాత్‌తో ఈ ఇద్దరూ మంచి ఆరంభం అందించడం చాలా ముఖ్యం. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా ఆడనున్నారు. సూర్య, గ్రీన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తిలక్ వర్మతో పాటు నెహాల్ వధేరా కూడా సూపర్బ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు.

టీమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, జాసెన్ బెహ్రాండార్ఫ్, ఆకాశ్ మధ్వాల్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. వీరికి కామెరూన్ గ్రీన్ అండగా ఉండనున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్ ఐదు వికెట్లతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోరును కొనసాగిస్తే ముంబైకి తిరుగుండదు.

గుజరాత్‌తో ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జాసెన్ బెహ్రాండార్ఫ్, కుమార్ కార్తీకేయ/హృతిక్ షోకీన్, ఆకాశ్ మధ్వాల్,

ఇంపాక్ట్ ప్లేయర్: నెహాల్ వధేరా

Story first published: Friday, May 26, 2023, 7:05 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+