Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI playing XI: సూర్య ఇన్.. ఆ కుర్రాడు ఔట్! ఢిల్లీతో తలపడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై వాంఖడే మైదానం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తయిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి లీగ్‌లో బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది.

సూర్య రీఎంట్రీ..
ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. చీల మండ గాయంతో ఆటకు దూరమైన సూర్య.. ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నీయా సర్జరీ చేయించుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముంగిటే గాయం నుంచి కోలుకున్నా మ్యాఛ్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అనుమతి లభించలేదు.

MI playing XI vs DC IPL 2024 Suryakumar Yadav IN and Naman Dhir OUT

తాజాగా ఫిట్‌నెస్ క్లియర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుతో కూడా కలిసినట్లు తెలుస్తోంది. అయితే సూర్య రీఎంట్రీపై ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతను ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే.. యువ ప్లేయర్ నమన్ ధిర్‌పై వేటు పడనుంది.

మఫకాపై వేటు..
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు సూర్య రీఎంట్రీ కలిసి రానుంది. ఇక బౌలింగ్ విభాగంలోనూ ముంబై ఇండియన్స్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ సమస్యలతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన లూక్ వుడ్.. ఢిల్లీతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. 17 ఏళ్ల యువ పేసర్ క్వెనా మఫకా బెంచ్‌కు పరిమితమవుతాడు.

MI playing XI vs DC IPL 2024 Suryakumar Yadav IN and Naman Dhir OUT

క్వెనా మఫకా.. ఆశించిన రీతిలో రాణించకపోవడంతో అతనిపై వేటు వేయనుంది. గత మ్యాచ్‌లో సత్తా చాటిన ఆకాశ్ మధ్వాల్ తన స్థానాన్ని నిలబెట్టుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా పియూష్ చావ్లా కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

డేవాల్డ్ బ్రెవిస్, రోమారియో షెఫర్డ్‌ల్లో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నారు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధిర్/ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, లూక్ వుడ్/క్వెనా మఫక, జస్‌ప్రీత్ బుమ్రా

డేవాల్డ్ బ్రెవిస్/రొమారియో షెఫర్డ్,

Story first published: Friday, April 5, 2024, 16:36 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+