For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI Playing XI: అతనిపై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో పేలవ ప్రదర్శన‌తో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఢిల్లీ వేదికగా శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్టాఫ్ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరగ్గా.. రోమారియో షెఫర్డ్ సంచలన బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ సంచలన విజయాన్నందుకుంది.

ఆ తరహా ప్రదర్శనతోనే మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

MI Playing XI vs DC for IPL 2024 Romario Shepherd likely to replace Nuwan Thushara

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ మూడు మార్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌లో హార్దిక్ సేన మార్పులు చేసే అవకాశం ఉంది. విధ్వంసకర ఆల్‌రౌండర్ రోమారియో షెఫర్డ్ జట్టులోకి రానుండగా.. నువాన్ తుషారాపై వేటు పడనుంది.

పియూష్ చావ్లాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన నెహాల్ వధేరాను జట్టులోనే కొనసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నువాన్ తుషారా దారుణంగా విఫలమయ్యాడు.

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్ కిషన్ ఆడనుండగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, మహమ్మద్ నబీ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్లుగా బరిలోకి దిగనుండగా.. గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా బౌలర్లుగా అవకాశం అందుకోనున్నారు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నెహల్ వధేరా, రోమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంపాక్ట్ ప్లేయర్: పియూష్ చావ్లా

Story first published: Friday, April 26, 2024, 16:49 [IST]
Other articles published on Apr 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+