న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI Playing XI vs DC: బుమ్రాకు రెస్ట్.. అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం! తుది జట్లు ఇవే!

 MI Playing XI vs DC: Arjun Tendulkar likley to replace Jasprit Bumrah

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అసలు సిసలు పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్‌ను గెలిచి ఘనంగా ఈ సీజన్‌ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై చేతిలో ఉంది.

రోహిత్ సేన గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయనుంది. దాంతో విశేష అభిమాణం కలిగిన ఆర్‌సీబీ గ్రూప్.. ఇప్పుడు ముంబై జట్టుకు మద్దతు తెలుపుతోంది. ముంబై గెలవాలని సోషల్ మీడియా వేదికగా ఆర్‌సీబీ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం మూడు ఫ్రాంచైజీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చెనా?

యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చెనా?

ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో అనూహ్యంగా చెలరేగింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌ను వరుసగా ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ గెలిచినంత పనిచేసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. విజయంతోనే ఈ లీగ్‌ను ముగించాలనుకుంటామని చెప్పాడు. అంతేకాకుండా తమ కోర్ టీమ్ పరీక్షిస్తామని, అప్‌కమింగ్ సీజన్ కోసం ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటిస్తామని తెలిపాడు.

అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం..

అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం..

రోహిత్ చెప్పినదాట్టి బట్టి చూస్తే జట్టులో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని ఆర్యన్ జుయాల్(వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్(బౌలర్), ఆకాశ్ మధ్వాల్(బౌలర్), రాహుల్ బుద్ది(బ్యాటర్)‌లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఒకేసారి నలుగురి అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. అర్జున్ టెండూల్కర్ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వచ్చు. లేదంటే రిలే మెరిడిత్‌ను పక్కనపెట్టవచ్చు.

మార్పుల్లేకుండానే ఢిల్లీ..

మార్పుల్లేకుండానే ఢిల్లీ..

ప్రస్తుతం ఢిల్లీ భవితవ్యం ఆ జట్టు చేతులోనే ఉంది. చెన్నై చేతిలో ఘోర పరాజయం అనంతరం పంత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలను అందుకుంది. రన్‌రేట్(0.255) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీకి బ్యాక్‌బోన్‌గా నిలుస్తున్నాడు. డేవిడ్ వార్నర్ సైతం కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అనారోగ్యంతో జట్టుకు గురైన పృథ్వీ షా కోలుకున్నా తుది జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్ విభాగం కూడా రాణిస్తోంది. రిషభ్ పంత్ ఒక్కడే స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అతను కూడా చెలరేగితే ఢిల్లీకి తిరుగుండదు.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, ట్రిస్టాన్ స్టబ్స్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, సంజయ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్/అర్జున్ టెండూల్కర్, మురుగన్ అశ్విన్/మయాంక్ మార్కండే

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్

Story first published: Saturday, May 21, 2022, 8:23 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X