Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI: ఓపెనర్‌గా రోహిత్.. అర్జున్‌కు నో ఛాన్స్! ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా రికార్డ్ సాధించిన ముంబై ఇండియన్స్.. గత నాలుగు సీజన్లుగా దారుణంగా విఫలమైంది. ఈ నాలుగు సీజన్లలో ఒకే ఒక్కసారి ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. మిగతా మూడు సీజన్లలో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానాలతో సరిపెట్టుకుంది. కెప్టెన్సీ, హెడ్ కోచ్ మార్పు.. సీనియర్ ఆటగాళ్లు దూరమవ్వడంతో ఆ జట్టు పతనాన్ని శాసించింది.

ఈ క్రమంలోనే జట్టు పూర్వవైభవమే లక్ష్యంగా ముంబై మేనేజ్‌మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. పేపర్‌పై బలంగా కనిపిస్తోంది. మెగా వేలానికి ముందే తమ కోర్ టీమ్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలను రిటైన్ చేసుకున్న ముంబై.. మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించింది.

MI Playing XI For IPL 2025 No Arjun Tendulkar Rohit Sharma To Open

రెండు రోజుల పాటు సాగిన మెగా వేలంలో తొలి రోజు మార్క్యూ ప్లేయర్ల జోలికి వెళ్లని ముంబై.. రెండో రోజు తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా రోహిత్, విల్ జాక్స్..
ముంబై ఇండియన్స్ ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ విల్ జాక్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోగా.. ఆర్‌టీఎమ్ కార్డు కూడా ఉపయోగించలేదు. దాంతో ముంబై రూ. 5.25 కోట్లకే అతన్ని దక్కించుకుంది.

మిడిలార్డర్‌లో తిలక్ వర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, యువ ప్లేయర్ రాబిన్ మింజ్ బరిలోకి దిగనున్నాడు. ఫినిషర్‌గా రాబిన్ మింజ్‌కు మంచి పేరు ఉంది. సూర్య, తిలక్ వర్మ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పేస్ ఆల్ రౌండర్‌గా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ ఆడనున్నాడు.

భీకరంగా పేస్ దళం..
జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. కొత్త బంతితో బౌల్ట్ బౌలింగ్ చేయనుండగా.. బుమ్రా మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయనున్నాడు. దీపక్ చాహర్ కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలో బుమ్రాకు తోడుగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కర్ణ్ శర్మకు అవకాశం దక్కవచ్చు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రాబిన్ మింజ్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రోహిత్‌ శర్మ , బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, తిలక్‌ వర్మ , విల్‌ జాక్స్, నమన్‌ ధీర్‌ , గజన్‌ఫర్‌, మిచెల్ సాంట్నర్‌ , రికిల్టన్‌ , టాప్లీ, లిజాడ్‌ , రాబిన్‌ , కర్ణ్‌ శర్మ , సత్యనారాయణ, రాజ్‌ అంగద్, శ్రీజిత్, అశ్వని కుమార్, అర్జున్‌ తెందుల్కర్, విఘ్నేశ్, బెవాన్‌.

Story first published: Sunday, December 22, 2024, 7:00 [IST]
Other articles published on Dec 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+