Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing 11 vs RCB: డికాక్, క్రిస్‌లిన్‌‌కు నో చాన్స్.. ఆర్‌సీబీతో తొలి పోరుకు ముంబై తుది జట్టు ఇదే!

MI Playing 11 vs RCB: Quinton de Kock to open alongside Rohit Sharma?

హైదరాబాద్: గతేడాది కరోనా భయంతో దేశ సరిహద్దులు దాటిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ఈసారి సొంత గడ్డకే తరలివచ్చింది. మండు వేసవిలో.. నిండైన వినోదాన్ని అందించేందుకు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సిద్ధమైంది. అదిరిపోయే 'స్టార్స్‌' షోతో ఐపీఎల్‌ ఆరంభం కానుంది. రోహిత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనే ఉత్సాహంలో ఉండగా.. విరాట్‌ కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కనీసం ఓ సారైనా విజేతగా నిలవాలని తపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభ మ్యాచ్‌ జరుగనుంది. ఇరుజట్లలో స్టార్లకు కొదవ లేకపోవడంతో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. అయితే సహజంగానే ముంబై ఇండియన్స్‌కు లీగ్‌లో తమ ప్రస్థానాన్ని నిదానంగా ఆరంభించి చివర్లో పుంజుకునే అలవాటుంది. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబై గత 8 సీజన్లుగా ఇప్పటిదాకా ఆరంభ మ్యాచ్‌లో గెలవలేదు.

రోహిత్‌కు జోడీ ఎవరు?

రోహిత్‌కు జోడీ ఎవరు?

ముంబై టీమ్ తమ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సేవలను కోల్పోనుంది. డికాక్ సౌతాఫ్రికా నుంచి నేరుగా చార్టెడ్ ఫ్లైట్‌లో ఇటీవలే చెన్నై చేరుకున్నాడు. బయో బబుల్‌ టు బయో బబుల్‌కు క్వారంటైన్ అక్కర్లేదని బీసీసీఐ చెప్పడంతో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడటం ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే అతను పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం బబుల్‌లోనే ఉన్నాడు. కానీ ఏమైందో ఏమో కానీ తాజా సమాచారం ప్రకారం డికాక్ మరో వారం పాటు క్వారంటైన్‌లో ఉండటనున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి అతను బయో బబుల్ బ్రేక్ చేసి ఉండాలి. ఈ సమాచారం ప్రకారం డికాక్ క్వారంటైన్‌లో ఉంటే మాత్రం ఈ మ్యాచ్‌కు దూరమవుతాడు. అప్పుడు రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్, క్రిస్‌లిన్‌లో ఒకరు ఓపెనర్‌గా వస్తారు. ఫామ్ పరంగా కిషన్‌కు ఎక్కువ చాన్స్ ఉంది.

సూర్య, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్..

సూర్య, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్..

ఓపెనింగ్ జోడికి అండగా సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్‌లో దిగుతాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కీరన్ పొలార్డ్, పాండ్యా బ్రదర్స్‌తో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్‌లో పొలార్డ్, పాండ్యా బ్రదర్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దగలరు. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు వీరు తమ సత్తా చూపెట్టారు. పైగా ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు కావడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఇటీవలే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన పొలార్డ్.. ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన పాండ్యా బ్రదర్స్.. ఆ జోరు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

చావ్లా/చాహర్..

చావ్లా/చాహర్..

ఇక రెగ్యులర్ స్పిన్నర్లు పీయూష్ చావ్లా, రాహుల్ చహర్‌లో ఎవరిని ఎంపిక చేస్తారో అనేదానిపై ఆసక్తి నెలకొంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే ఇద్దరిని తీసుకోవచ్చు. అప్పుడు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరే కావాలనుకుంటే మాత్రం చాహర్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాహుల్ చాహర్ రాణించాడు. పైగా గత సీజన్‌లో కూడా జట్టుకు అండగా నిలిచాడు. ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగితే రోహిత్ ముందు మరో సవాల్ ఉండనుంది. బుమ్రా, బౌల్ట్‌లతో పాటు బరిలోకి దిగే మూడో పేసర్‌ను ఎంచుకోవాలి. గతంలో ఈ ప్లేస్‌లో ఆడే ప్యాటిన్సన్ ఈ సీజన్‌కు లేకపోవడం సమస్యగా మారింది. దాంతో మూడో పేసర్‌గా నాథన్ కౌల్టర్ నీల్ను తీసుకోవచ్చు.

తుది జట్టు:(అంచనా)

తుది జట్టు:(అంచనా)

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేమ్స్ నిషమ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్/జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Friday, April 9, 2021, 16:24 [IST]
Other articles published on Apr 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+