MI vs CSK: మెరిడిత్ ఇన్.. పొలార్డ్ ఔట్! చెన్నైతో బరిలోకి దిగే ముంబై తుది జట్టు ఇదే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. వరుసగా 6 పరాజయాలతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్.. ఆరు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌తోనైనా ఆ ముచ్చట తీర్చుకోని పరువు కాపాడుకోవాలనుకుంటుంది. మరోవైపు గుజరాత్‌తో గత మ్యాచ్‌ను చివరి నిమిషంలో చేజార్చుకున్న చెన్నై మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవతర్తంగా సాగనుంది.

కీరన్ పొలార్డ్..
సరిగ్గా ఈ మ్యాచ్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కీరన్ పొలార్డ్.. బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌పై పొలార్డ్‌కు మంచి రికార్డు ఉంది. చెన్నై అంటే అతనికి పూనకం వస్తుంది.
ఈ జట్టుపై అతని స్ట్రైక్‌రేట్ 172గా ఉంది. ఈ లెక్కన అతను తుది జట్టులో ఉండే అవకాశాలున్నాయి. పొలార్డ్ దూరమైతే టీమ్ డెవిడ్ ఆడనున్నాడు. ఇక ధారళంగా పరుగులిస్తున్న టైమల్ మిల్స్‌పై వేటు వేసి రిలే మెరిడిత్‌కు అవకాశం ఇవ్వవచ్చు. బౌలింగ్‌లో బుమ్రాకు తోడు ఉనాద్కత్ రాణించడం శుభపరిణామం.
ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ శుభారంభం అందించాల్సి ఉంది. రోహిత్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆ తర్వాత వచ్చే బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సూపర్ ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కత్‌లతో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.

డ్వేన్ ప్రిటోరియస్‌కు చాన్స్..
చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒకే ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధారళంగా పరుగులిస్తున్న క్రిస్ జోర్డాన్ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ బరిలోకి దిగనున్నాడు. చెన్నైకి బౌలింగే బలహీనగా మారింది. దీపక్ చాహర్ గైర్హాజరీ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
మహీష్ తీక్షణ రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం కొండంత అండ. గుజరాత్‌తో అతను 73 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు. డ్వేన్ ప్రిటోరియస్ మినహా చెన్నైలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

పిచ్ రిపోర్ట్..
డీవై పాటిల్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ డ్యూ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పిచ్‌పై గ్రాస్ ఉండటంతో పేస్‌తో పాటు అనూహ్య బౌన్స్ ఉంటుంది. స్పిన్నర్లకు కూడా కలిసొస్తుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని విజయం సాధించడం ఇక్కడ కుదరదు. ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో 5 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్‌కు ప్రాధాన్యత లేదు. ఆర్‌సీబీ, లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందింది.

తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్/ టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్/టైమిల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్/ డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications