Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ముంబై ఇండియన్స్ షెడ్యూల్ ఇదే.. ఆ జట్టుతోనే తొలి మ్యాచ్!

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సారి చాలా ముందుగానే ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 22నుంచి మే 25 వరకు ఈ ధనాధన్ లీగ్ అభిమానులను అలరించనుంది. మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచ్‌లతో ఈ క్రికెట్ పండుగ సాగనుంది. ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్.. తమ తొలి మ్యాచ్‌ను మరో సక్సెస్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

చెన్నై వేదికగా మార్చి 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఐదేసి టైటిళ్లు గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 లీగ్ దశలో ముంబై ఇండియన్స్ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. హోమ్ గ్రౌండ్‌లో ,ప్రత్యర్థి వేదికపై ఏడేసి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ సీడింగ్‌లో గ్రూప్-బీలో ఉన్న ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నోలతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న కేకేఆర్, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్‌లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడనుంది.

MI IPL 2025 Full Schedule Mumbai Indians to face CSK on March 23 at Chennai

ముంబై ఇండియన్స్ షెడ్యూల్..
మార్చి 23: సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్(చెన్నై)-రాత్రి 7.30 గంటలకు

మార్చి 29: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(అహ్మదాబాద్)-రాత్రి 7.30 గంటలకు

మార్చి 31: ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ముంబై)- రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 4: లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (లక్నో)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 7: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ముంబై) -రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 13: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(ముంబై)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 20: ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 27: ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ (ముంబై)-మధ్యాహ్నం 3:30 గంటలకు

మే 1: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (జైపూర్)- రాత్రి 7.30 గంటలకు

మే 6: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (ముంబై)- మధ్యాహ్నం 3:30 గంటలకు

మే 11: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముల్లన్పూర్)- మధ్యాహ్నం 3:30 గంటలకు

మే 15: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)-రాత్రి 7.30 గంటలకు

ముంబై ఇండియన్స్ జట్టు:
జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్
నమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ, రయన్ రికెల్టన్, దీపక్ చహర్, ముజీబ్ ఉర్ రహ్మాన్(రిప్లేస్‌మెంట్), విల్ జాక్స్, అశ్వనీ కుమార్
మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లే, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బేవన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజాద్ విలియమ్స్, విగ్నేష్ పుతూర్.

Story first published: Monday, February 17, 2025, 10:43 [IST]
Other articles published on Feb 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+