Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: పటిష్టంగా ముంబై ఇండియన్స్.. పూర్తి జట్టు ఇదే!

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందే స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆ జట్టుకు అందుకు తగ్గట్లుగా జట్టును నిర్మించింది. టీమిండియా టాప్ ఆటగాళ్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్.. వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది.

భారత స్టార్ ఆటగాళ్లతోనే ఆ జట్టుకు సగం బలం రాగా.. మిగతా బలాన్ని వేలంలో కొనుగోలు చేసింది. తక్కువ డబ్బుతో వేలంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్ మార్క్యూ ప్లేయర్ల జోలికి పోకుండా తొలి రోజు సైలెంట్‌గా ఉంది. రెండో రోజు తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే టార్గెట్ చేసి అతి తక్కువ ధరకే మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

MI IPL 2025 Final Squad Full List Of Players Bought By Mumbai Indians In Mega Auction

తాజా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లు మాత్రమే. బౌల్ట్‌ను రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై.. దీపక్ చాహర్ కోసం రూ. 9.25 కోట్లు ఖర్చు చేసింది. విల్ జాక్స్‌ను రూ. 5.25 కోట్లకు, అల్లా గజన్‌ఫర్‌ను రూ. 4.80 కోట్లకు దక్కించుకుంది.

అనామక ఆటగాళ్లపైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసింది. నమన్ ధీర్‌ను రూ. 5.25 కోట్లకు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ సమతూకంగా కనిపిస్తోంది. ఆన్‌పేపర్‌పై ముంబై జట్టు పటిష్టంగా ఉంది.

ముంబై ఇండియన్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

నమన్ ధీర్(రూ. 5.25 కోట్లు), రాబిన్ మింజ్(రూ. 65 లక్షలు), కర్ణ్ శర్మ(రూ. 50 లక్షలు), ట్రెంట్ బౌల్ట్(రూ. 12.50 కోట్లు), ర్యాన్ రికెల్టన్(రూ. కోటి), దీపక్ చాహర్(రూ. 9.25 కోట్లు), అల్లా గజన్‌ఫర్(రూ. 4.80 కోట్లు), విల్ జాక్స్(రూ. 5.25 కోట్లు), అశ్వని కుమార్(రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్(రూ. 2 కోట్లు), రీస్ టోప్లీ(రూ. 75 లక్షలు), క్రిష్ణన్ ష్రిజిత్(రూ. 30 లక్షలు), రాజ్ బవా(రూ. 30 లక్షలు), సత్యనారాయణ రాజు(రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్(రూ. 30 లక్షలు), లిజాడ్ విలియమ్స్(రూ. 75 లక్షలు), విగ్నేష్ పుతుర్(రూ. 30 లక్షలు)

ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
హార్దిక్ పాండ్యా(రూ. 18 కోట్లు), రోహిత్ శర్మ(రూ.16.30 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు).

Story first published: Monday, November 25, 2024, 22:38 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+