ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై వాంఖడే మైదానం వేదికగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
గత రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తయిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి లీగ్‌లో బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది.

కెప్టెన్సీ మార్పుతో..
గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సునాయసంగా గెలిచే మ్యాచ్‌లను ముంబై ఇండియన్స్ చేజేతులా చేజార్చుకుంది. అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. ఐదు ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రతీ మ్యాచ్‌లో సూటి పోటి నినాదాలతో హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మనే తమ కెప్టెన్ అంటూ హార్దిక్‌ను ఎగతాళి చేశారు. హార్దిక్ చేసే తప్పిదాలను భూతద్దంలో పెట్టి మరి చూస్తున్నారు.
రోహిత్ అభిమానుల ఆందోళన..
ఇక రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ అభిమానులు వాంఖడే స్టేడియం ముంగిట రచ్చ చేసారు. 'ముంబైకా రాజా రోహిత్ శర్మ'అంటూ నినాదాలు చేసారు. దాంతో న్యూట్రల్ ఫ్యాన్స్ 'మ్యాచ్‌కు ముందే మొదలు పెట్టారా.. మీ దుంప తెగ'అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కెప్టెన్సీ మార్పు నిర్ణయంతో ముంబై ఇండియన్స్ రెండు గ్రూప్‌లుగా విడిపోయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆకాశ్ మద్వాల్ వంటి ఆటగాళ్లు ఒక గ్రూప్‌లో ఉంటే.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఇతర ప్లేయర్లు మరో గ్రూప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
హార్దిక్‌కు సహకరించని రోహిత్..
ఆటగాళ్ల మధ్య ఉన్న విభేదాలు ఆటపై ప్రభావం చూపుతున్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాటలను రోహిత్ వర్గం పట్టించుకోవడం లేదు. రోహిత్ శర్మను మచ్చిక చేసుకునేందుకు హార్దిక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతను సహకరించడం లేదు.
దాంతో ముంబై ఇండియన్స్ జట్టులో సైలెంట్ వార్ నడుస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి వాతావరణం నెలకొందో ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి అదేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.