Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అర్జున్ టెండూల్కర్‌ను ఆడించలేదు: ముంబై బౌలింగ్ కోచ్

MI bowling coach Shane Bond reveals why Arjun Tendulkar didnt play in IPL 2022

న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్నా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మరింత రాటు దేలాల్సి ఉందని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అన్నాడు. ఈ కారణంతోనే ఐపీఎల్ 2022 సీజన్‌లో అర్జున్‌ను తుది జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు. సచిన్ వారసుడిగా, ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా అర్జున్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారని, వారి అంచనాలు అందుకునేలా అర్జున్ సంసిద్దం కావాలన్నాడు.

ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అందరికన్నా ముందు తప్పుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోవడంతో ముంబై ప్రయోగాలకు తెరదీసింది. జట్టులోని యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించింది.

అర్జున్ అరంగేట్రం కోసం..

అర్జున్ అరంగేట్రం కోసం..

ఈ క్రమంలోనే హృతిక్ షోకీన్, కుమార కార్తీకేయ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది. దాంతో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు కూడా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ కోసం ముంబై రూ.30 లక్షలు ఖర్చు పెట్టింది. పైగా నెట్స్‌తో అతను సూపర్ యార్కర్లతో చెలరేగాడు.

ఆ వీడియోలను ముంబై ఇండియన్సే అభిమానులతో పంచుకుంది. దాంతో అర్జున్ అరంగేట్రం ఖాయమని అంతా భావించారు. కనీసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అయినా అవకాశం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ అర్జున్‌కి మాత్రం అవకాశం దక్కలేదు. దాంతో ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సచిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సచిన్ వారసుడంటే..?

సచిన్ వారసుడంటే..?

అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణాన్ని తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ తెలిపాడు.'అర్జున్ టెండూల్కర్ ఇంకా పూర్తిగా రాటుతేలలేదు. అతను ఇంకా కొద్దిగా పని చేయాల్సి ఉంది. సచిన్ వారసుడిగా, ముంబై ఇండియన్స్ వంటి టీమ్ తరుపున ఆడుతున్నప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ చాలా అంచనాలు పెట్టుకుంటారు. అర్జున్ టెండూల్కర్ ఆ అంచనాలను అందుకోగలగాలి.అందుకే తుది జట్టులో వచ్చే ముందు అతను ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అర్జున్ చాలా కష్టపడుతున్నాడు.

బ్యాటింగ్, ఫీల్డింగ్ మెరుగవ్వాలి..

బ్యాటింగ్, ఫీల్డింగ్ మెరుగవ్వాలి..

మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత రాటు దేలాలి. అర్జున్ టెండూల్కర్‌ హార్ఢ్ వర్క్‌తో పాటు తన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో డెవలప్‌మెంట్ వచ్చిందని టీమ్ భావిస్తే, తప్పుకుండా తుది జట్టులో చోటిస్తాం. ప్రతీ ఒక్కరికీ ఛాన్స్ ఇవ్వడానికి, అర్హత ఉన్నవారికి అవకాశం ఇవ్వడానికి మధ్య చాలా తేడా ఉంది. ముంబై ఇండియన్స్ వంటి టీమ్‌లో తుది జట్టులో చోటుని పోరాడి సాధించుకోవాలి. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చాలా మెరుగైంది. అయితే ఆల్‌రౌండర్‌కి బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా అవసరం.'అంటూ షేన్ బాండ్ చెప్పుకొచ్చాడు.

ముంబై రంజీ జట్టులో..

ముంబై రంజీ జట్టులో..

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచుల్లో 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఇలాంటి దారుణమైన సీజన్‌లోనూ అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం లేదు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ముంబై రంజీ టీమ్‌లో కూడా అర్జున్ చోటు కోల్పోయాడు. రంజీ నాకౌట్స్ ఎంపిక చేసిన జట్టులో అర్జున్ పేరు లేదు. అతను వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడినా.. తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.

Story first published: Friday, June 3, 2022, 17:31 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+