Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫలించని మెక్సికో అభిమానుల కుయుక్తులు!(వీడియో)

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో పోరాటం ముగిసింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-2 తేడాతో మెక్సికోను ఓడించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. మెక్సికో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ జట్టు కోసం మెక్సికో అభిమానులు పన్నిన కుయుక్తులు ఫలించలేదు.

ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన ముందు మెక్సికో ఫ్యాన్స్ మైండ్ గేమ్స్ తేలిపోయాయి. ప్లేయర్ల ఏకాగ్రతను చెడగొట్టేలా అర్థరాత్రి ఇంగ్లండ్ ఆటగాళ్లు బస చేసే హోటళ్ల సమీపంలో బాణాసంచా కాల్చడం, డ్రమ్స్ వాయించడం వంటి చర్యలతో నానా హంగామా సృష్టించారు. గతంలో ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లకు ముందు కూడా వీరు ఇలాగే ప్రవర్తించారు.

FIFA World Cup 2026‌లో బెట్టింగ్ జోరు.. మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!

FIFA World Cup 2026‌లో బెట్టింగ్ జోరు.. మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!

ఈ టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే లక్ష్యంగా మెక్సికన్ అభిమానులు వ్యవహరించారు. కానీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మెక్సికన్ల పాచికలు పారలేదు. ఇంగ్లండ్ జట్టు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా సత్తా చాటి మెక్సికోను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. అద్వితీయమైన విజయంతో వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఘనంగా అడుగుపెట్టింది.

Mexico Fans Fireworks Backfire as England Overcome Sleepless Night to March into World Cup Quarter-Finals

ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇంగ్లండ్ ప్లేయర్ జుడె బెల్లింగ్ హామ్(36, 38వ నిమిషంలో) రెండు గోల్స్ నమోదు చేయగా.. కెప్టెన్ హ్యారీ కేన్(60వ నిమిషంలో) పెనాల్టీ కిక్‌ను గోల్ మలిచాడు. మెక్సికో తరఫున జులియన్ క్వినోనెస్(42వ నిమిషం), రౌల్ జిమెనెజ్(69వ నిమిషం) పెనాల్టి కిక్‌ను గోల్‌గా మల్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జారెల్ క్వాన్సా(54వ నిమిషంలో) రెడ్ కార్డ్ ఎదుర్కొని బయటకు వెళ్లిపోవడంతో ఇంగ్లండ్ 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించింది.

ఫిఫా ప్రపంచ కప్ వేళ రొనాల్డో సంచలన నిర్ణయం!

ఫిఫా ప్రపంచ కప్ వేళ రొనాల్డో సంచలన నిర్ణయం!

వయాగ్రా ట్లాబెట్లు వాడుతున్నట్లు వచ్చిన వార్తలను ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ ఖండించింది.
ప్రతికూల వాతావరణంలో స్టామినాను పెంచుకునేందుకు ఇంగ్లండ్ టీమ్ వయాగ్రా టాబ్లెట్స్ వాడనుందని, ఇందుకోసం ఫిఫా అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని, తమ ఆటగాళ్లు ఎలాంటి వయాగ్రా ట్యాబ్లెట్లు వాడలేదని ఇంగ్లండ్ ఫుట్‌‌బాల్ టీమ్ స్పష్టం చేసింది.

Story first published: Monday, July 6, 2026, 14:23 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+