Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ విజయం.. 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రధాని!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్‌పై సోషల్ మీడియా వేదికగా జోక్స్ పేలుతున్నాయి. ఈ విజయాన్ని ప్రపంచకప్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకోవాలని పాకిస్థాన్ టీమ్‌కు భారత నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ విజయానికి సంబంధించిన మీమ్స్, పారడీ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఏ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ షాహీన్స్ సూపర్ ఓవర్‌‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షాహీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులే చేసింది.

అనంతరం బంగ్లాదేశ్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్..3 బంతులే ఆడి 6 పరుగులే చేసి ఆలౌటైంది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌట్ అనే సంగతి తెలిసిందే. అనంతరం పాకిస్థాన్ నాలుగు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.

Memes Galore as Fans Joke About Pakistan PM s Holiday After Asia Cup Rising Stars Triumph

ఈ విజయానంతరం పాకిస్థాన్ షాహీన్స్ ఆటగాల్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ప్రపంచకప్ గెలిచిన తరహాలోనే తమ జాతీయ జెండాలను పట్టుకొని మైదానమంతా తిరిగారు. అయితే ఈ సంబరాలపై భారత నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ 3 రోజుల సెలువులు ప్రకటించాడని పారడీ అకౌంట్స్‌‌తో ట్వీట్స్ చేస్తున్నారు.

'ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ అందుకోవడం మాములు విషయం కాదు. ఈ విజయం ప్రపంచకప్ గెలుపు కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఈ విజయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 రోజులు సెలవుగా ప్రకటిస్తున్నా'అని షెహ్‌బాజ్ షరీఫ్ పేరిట ఉన్న పారిడీ అకౌంట్‌తో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న భారత నెటిజన్లు.. విక్టరీ పరేడ్ కూడా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారుతుంది.

Story first published: Monday, November 24, 2025, 14:10 [IST]
Other articles published on Nov 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+