Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS రెండో టీ20కి భారీ అడ్డంకి!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న రెండో టీ20కి భారీ అడ్డంకి ఏర్పడింది. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 93 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని AccuWeather పేర్కొంది. గురువారం కూడా భారీ వర్షం పడనుందని పేర్కొంది.

అయితే వర్షం కాసేపు బ్రేక్ ఇచ్చినా.. మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ మెల్‌బోర్న్ గ్రౌండ్‌కు ఉంది. కానీ వర్షం బ్రేక్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ కూడా తొలి టీ20 తరహాలో వర్షార్పణం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Melbourne Weather Update Rain Could Disrupt India vs Australia 2nd T20I

కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20 కూడా వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 5 ఓవర్లలో 43/1 స్కోర్ చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. కాసేపటికి వరణుడు శాంతించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. ఆట తిరిగి ప్రారంభం కాగా.. భారత బ్యాటర్లు చెలరేగారు. 9.4 ఓవర్లలో 97/1 స్కోర్ చేయగానే మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఎంత నిరీక్షించిన వరుణుడు శాంతించలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టీ20లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెల్‌బోర్న్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల ముఖాముఖి పోరు 7-4గా ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఈ మైదానంలో ఇరు జట్లు 14 సార్లు తలపడగా.. భారత్ నాలుగు మాత్రమే గెలిచింది. ఆసీస్ 7 గెలవగా మరో మూడుమ్యాచ్‌లు డ్రా అయ్యాయి. టీ20ల్లో నాలుగు సార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో రెండు సార్లు గెలిచాయి.

రెండో టీ20 కూడా రద్దయితే ఐదు టీ20ల సిరీస్ కాస్త మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా మారుతుంది. నవంబర్ 2న హోబర్ట్ వేదికగా రెండో టీ20, నవంబర్ 6న గోల్డ్ కోస్ట్ వేదికగా, నాలుగో20, నవంబర్ 8న గబ్బా వేదికగా ఐదో టీ20 జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, October 30, 2025, 10:30 [IST]
Other articles published on Oct 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+