Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగు టాప్ హీరో ఇంటికి తిలక్ వర్మ..ఎందుకంటే!(వీడియో)

టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ కలిసాడు. మెగాస్టార్ అప్‌కమింగ్ మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్ సెట్స్‌లో చిరంజీవితో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను చిరంజీవి సన్మానించాడు. ఆసియా కప్ 2025లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించాడు.

బిజీ షెడ్యూల్ మధ్య కూడా సమయం కేటాయించి టీమిండియా ఛాంపియన్‌ను చిరు ఆహ్వానించాడు. శాలువాతో సన్మానించడంతో పాటు పాకిస్థాన్‌తో ఫైనల్లో భారత్‌ను గెలిపించిన అనంతరం తిలక్ వర్మ చేసిన విజయనాదానికి సంబంధించిన ఫ్రేమ్‌ను బహుమతిగా అందించాడు.

Megastar Chiranjeevi Felicitates Tilak Varma for Asia Cup Heroics on Mana Shankara Vara Prasad Garu Sets

ఈ సన్మాన కార్యక్రమంలో మెగా స్టార్‌తో పాటు ఈ సినిమా హీరోయిన్ నయనతార, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. తన ఫేవరేట్ హీరో ద్వారా సన్మానం అందుకోవడం చిరస్మరణీయ క్షణమని ఈ సందర్భంగా తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం తిలక్ వర్మ హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐదు టీ 20ల సిరీస్ కోసం అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.

Story first published: Thursday, October 16, 2025, 17:34 [IST]
Other articles published on Oct 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+