Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా: రామ్ చరణ్

Mega Power star Ram Charan says he eager to play Virat Kohli in his biopic

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అన్నాడు. విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని ఈ గ్లోబల్ స్టార్ వెల్లడించాడు. ఇక క్రికెటర్లు, రాజకీయ నేతలు, సినీ స్టార్ల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ జీవితాలపై నిర్మించిన బయోపిక్స్‌ అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎవరి బయోపిక్‌లోనైనా నటించాలనుందా? అని రామ్ చరణ్‌ను ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు చెప్పాడు. 'నేను చాలా రోజులుగా స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో నటించాలని భావిస్తున్నా. అవ‌కాశం వ‌స్తే మాత్రం క‌చ్చితంగా విరాట్ కోహ్లీ బ‌యోపిక్‌లో న‌టిస్తా. ఎందుకంటే విరాట్ కోహ్లీని నేను స్పూర్తిగా తీసుకుంటాను. అతని బ‌యోపిక్‌లో న‌టించే అవకాశం వ‌స్తే మాత్రం అస్సలు వదులుకోను'అని ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2022 కార్యక్రమంలో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట, 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' కేటగిరిలో 'ఆస్కార్' అవార్డు అందుకుంది. ఈ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ట్రిపుల్ ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇండియా టుడే కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mega Power star Ram Charan says he eager to play Virat Kohli in his biopic

విరాట్ కోహ్లీ చరిత్ర బయోపిక్‌కు సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ పాత్రకు రామ్ చరణ్ సరిగ్గా సరిపోతాడని,కోహ్లీ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని షేడ్స్ ఉన్నాయంటున్నారు. చిన్న తనంలో సాధారణ జీవితం గడపడం, క్రికెటర్ గా ప్రపంచ దిగ్గజంగా ఎదగడం, బాలీవుడ్ నటి అనుష్కతో ప్రేమ, పెళ్లి, క్రికెట్ కెప్టెన్‌గా బీసీసీఐనే తన ఆధీనంలోకి తీసుకోవడం.. ఆ తర్వాత అంతర్గత రాజకీయాలతో కెప్టెన్సీ కోల్పోవడం వంటి అంశాలు బయోపిక్‌కు సరిగ్గా సరిపోతాయని కామెంట్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాతే కోహ్లీ బయోపిక్ వచ్చే అవకాశం ఉంది. యాక్టింగ్ చేయగల కోహ్లీనే తన పాత్ర కూడా పోషించవచ్చు.

Story first published: Saturday, March 18, 2023, 13:05 [IST]
Other articles published on Mar 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+