Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ కాదు.. వైభవ్ సూర్యవంశీ‌ టాలెంట్ గుర్తించింది అతనే

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97)విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకొని క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.

దాంతో వైభవ్ సూర్యవంశీ గురించి నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ సిక్సర పిడుగు ప్రతిభను తొలుత గుర్తించింది ఎవరా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ సమర్ ఖాద్రి గుర్తించాడు.

Meet Samar Quadri and Akshay Karanje The Mastermind RR Scouts Who Unearthed Prodigy Vaibhav Sooryavanshi

ఓ లోకల్ మ్యాచులో వైభవ్ సిక్సర్లకు ఆయన ఫిదా అయ్యాడు. ఓసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్ మైండ్ జుబిన్ టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించాలని సమర్‌కు సూచించగా ఆయన వైభవ్ పేరు చెప్పాడు. చెన్నైలో స్కౌటింగ్ ట్రయల్‌లో ఆ చిచ్చరపిడుగు 60 బంతుల్లోనే 150+ స్కోర్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా వైభవ్ సూర్యవంశీ అలవోకగా బాదడంతో రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ టీమ్ ఆశ్చర్యపోయింది.

అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు వైభవ్ సూర్యవంశీ చెప్పడంతో అతను టెస్ట్ చేసి మరి ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు కొనుగోలు చేశాడు. గత సీజన్‌లోనే అవకాశం కల్పించగా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ఐకాన్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో జట్టును క్వాలిఫయర్-2కు చేర్చాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 28, 2026, 13:19 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+