For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాత గర్ల్‌ఫ్రెండ్‌‌కు గుడ్‌బై.. ప్రముఖ మోడల్‌తో రిషభ్ పంత్ డేటింగ్!

Meet Rishabh Pants girlfriend Isha Negi? All we know about Delhi Capitals skippers beautiful ladylove

న్యూఢిల్లీ: సూపర్ పెర్ఫామెన్స్‌తో కెరీర్‌లో మంచి పీక్స్‌లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ నయా కెప్టెన్ రిషభ్ పంత్.. రియల్ లైఫ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. పాత గర్ల్‌ఫ్రెండ్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌటేలాతో ఈ ఢిల్లీ యువ ఆటగాడు గతంలో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్‌ చెప్పి, ప్రముఖ మోడల్‌ ఇషా నేగితో ప్రేమాయణం నడుపుతున్నాడు.

ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఇషా నేగితో చనువుగా దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన పంత్.. 'నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాల‌నుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండ‌టానికి నువ్వే కారణం'అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో వీరిద్దరూ పీకల్లోతూ లవ్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరోవైపు ఇషా కూడా పంత్‌పై తనకున్న ప్రేమను బహిర్గతం చేసింది. ఆమె కూడా పంత్‌తో దిగిన ఫోటోలను త‌న ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'నువ్వే నా మ‌గాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నా జీవితంలోని ప్రేమవి నువ్వే'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. వృత్తి రిత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన ఇషా.. అమిటీ యూనివర్శిటీ నుంచి బీఏ హాన‌ర్స్‌ డిగ్రీ పొందింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రౌటేలా మాట్లాడుతూ.. పంత్‌ గురించి తనకు తెలీదని, క్రికట్‌ను తానంతగా ఇష్టపడనని, సచిన్‌..కోహ్లి అంటే తనకు గౌరవమని పేర్కొనడం విశేషం. అయితే రౌటేలా వాట్సాప్ నంబర్‌‌ను కూడా పంత్ బ్లాక్ చేశాడని తెలుస్తోంది.

Story first published: Friday, April 2, 2021, 20:35 [IST]
Other articles published on Apr 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+