Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు.. వారిని కఠినంగా శిక్షించాలి! పాకిస్తాన్ పరువు పోయింది: అక్తర్‌ ఫైర్

Medical panel played with the lives of people: Shoaib Akhtar slams PCB after PSL 2021 postponed

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఆరో ఎడిష‌న్‌‌ను గురువారం వాయిదా పడింది. ఇటీవలే ప్రారంభం అయిన పీఎస్‌ఎల్‌లో పాల్గొంటున్న‌ వారిలో ఏడు మంది ఆట‌గాళ్లు కరోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలడంతో.. పీసీబీ టోర్నీని అర్ధాంతరంగా వాయిదా వేసింది. దీంతో అక్తర్‌ పీసీబీ పెద్దలపై విరుచుకుపడ్డాడు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని అక్తర్ అన్నాడు. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలి

మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలి

షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డుపై ఫైర్ అయ్యాడు. 'పీఎస్‌ఎల్‌లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. బయోసెక్యూర్‌ పరిస్థితుల్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది. కానీ అలా జరగలేదు. మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా. ఎందుకంటే వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా పీసీబీ సీఈవో వసీమ్‌ ఖాన్‌ పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయనను ఎవరు తీసుకొచ్చారు? పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సాన్‌ మని తెచ్చారు. ఇప్పుడు మని ఎక్కడున్నారు? దీనికి ఆయన సమాధానం ఇవ్వాలి' అని అన్నాడు.

హోటల్‌లో వివాహాలు

హోటల్‌లో వివాహాలు

'పీఎస్‌ఎల్ వాయిదా విషయంలో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ‌ఖాన్‌ జోక్యం చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో ఆయన ప్రశ్నించాలి. పీసీబీ పెద్దలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆటగాళ్ల కోసం బుక్‌ చేసిన హోటల్‌లో వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా నిబంధనల్ని అతిక్రమించి తిరుగుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు?' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.

పాక్ పరువు తీశారు

పాక్ పరువు తీశారు

ఇలా జరగడం వల్ల ఆటగాళ్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పరువు కూడా పోయిందని మాజీ పేసర్‌ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇందుకు పీసీబీ ఛైర్మన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ను నిర్వహించి ఎహ్‌‌సాన్‌ పాకిస్థాన్‌ దేశ పరువుతో పాటు ఆ క్రికెట్‌ బోర్డు పరువు కూడా తీశాడని షోయబ్‌ అక్తర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 20న ఆరంభమైన పీఎస్‌ఎల్‌ 2021 మార్చి 22 వరకు కొనసాగాల్సింది. తాజా నిర్ణయంతో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ సహా ఫైనల్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.

ప్లేయ‌ర్ల‌కు వ్యాక్సిన్లు

ప్లేయ‌ర్ల‌కు వ్యాక్సిన్లు

కరోనా కేసులు పెరగడంతో ఆట‌గాళ్ల ఆరోగ్యం, క్షేమం దృష్ట్యా పీఎస్‌ఎల్ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం పేర్కొంది. ప్రాంచైజీ ఓన‌ర్ల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీసీబీ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం టోర్నీని నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఆట‌గాళ్ల‌కు వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్న‌ది. ఆరు ఫ్రాంచైజీల‌కు చెందిన ప్లేయ‌ర్ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్నారు. పాజిటివ్‌గా తేలిన ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లోకి పంప‌నున్నారు

India vs England: విరాట్ కోహ్లీ డ‌కౌట్‌.. క‌ష్టాల్లో టీమిండియా!!

Story first published: Friday, March 5, 2021, 12:09 [IST]
Other articles published on Mar 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+